Site icon HashtagU Telugu

Vastu Tips: ఉదయం లేవగానే ఆ ఐదు రకాల పనులు చేస్తున్నారా.. అయితే దారిద్యం పట్టిపీడించడం ఖాయం?

Mixcollage 04 Jan 2024 04 52 Pm 9090

Mixcollage 04 Jan 2024 04 52 Pm 9090

వాస్తు శాస్త్రంలో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేయాల్సిన పనుల గురించి చేయకూడని పనుల గురించి చెప్పబడ్డాయి. ముఖ్యంగా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక సమస్యలకు మానసిక సమస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి వాస్తు ప్రకారం కొన్ని రకాల పనులు చేయడం నిషేధం. అటువంటి వాటిలో ఉదయం లేచిన తర్వాత ముఖ్యంగా ఐదు రకాల పనులు అస్సలు చేయకూడదు. పొరపాటున కూడా అలాంటి పనులు చేశారంటే దరిద్రం పెట్టి పీడించడం ఖాయం. మరి ఉదయం లేవగానే ఎలాంటి పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిద్ర లేవగానే మీ నీడను మీరు చూడకూడదు. ఇది అశుభానికి ప్రతీకగా బావించాలి. దీనివల్ల ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

అలాగే ఉదయం లేవగానే ఎవరినీ పల్లెత్తు మాటనకూడదు. ముఖ్యంగా తిట్టడం అనేది చేయకూడదు. లేకపోతే నెగెటివిటీ కారణంగా మొత్తం రోజంతా పాడయిపోతుంది. ఉదయం లేవగానే తల్లిదండ్రుల్ని నమస్కరించి దేవుడిని ప్రార్ధించాలి. లేదంటే అరచేతులను కూడా చూసుకోవచ్చు. ఉదయం లేవగానే ఎంగిలి గిన్నెలు చూడకూడదు. దీనివల్ల చాలా నష్టం కలుగుతుంది. ఉదయం ఎంగిలి గిన్నెలు చూడటం వల్ల దౌర్భాగ్యం ఎదురౌతుంది. ఆర్ధిక ఇబ్బందులు కూడా వెంటాడవచ్చు. అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో గిన్నెలు,కిచెన్ శుభ్రం చేసుకొని పడుకోవడం వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది.

ఒకవేళ రాత్రి సమయంలో శుభ్రం చేసుకోలేని వారు ఆ ఎంగిలి పాత్రను బయట కడిగే ప్రదేశంలో పెట్టి ఉదయాన్నే కడుక్కోవచ్చు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో పాతకాలం రోజుల్లో ఉదయం 5 గంటలకే లేచి పనులు ప్రారంభిస్తుంటారు. ఇది చాలా మంచి అలవాటు. ఆరోగ్యపరంగా కూడా మంచిది. ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతాయి. వ్యాధులు కూడా తలెత్తవచ్చు. ఉదయాన్నే లేచి చక చక పనులు చేసే వారికి లక్ష్మీ అనుగ్రహం తప్ప కలుగుతుంది. అదేవిదంగా ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు. చాలామందికి ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం అలవాటు. ఇది మంచి అలవాటు కాదు. దీనివల్ల చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పనులు సక్రమంగా పూర్తి కాకుండా ఆగిపోతాయి.