Site icon HashtagU Telugu

Money Mistakes: డబ్బును లెక్కించేటప్పుడు అలాంటి పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే?

Mixcollage 13 Jun 2024 04 28 Pm 9745

Mixcollage 13 Jun 2024 04 28 Pm 9745

మామూలుగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని ఆర్థికపరమైన సమస్యలు రాకూడదని కోరుకుంటూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నగారు జీవితంలో డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎక్కడ అయితే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో అలాంటి వాళ్లకు అలాంటి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అలాగే జీవితంలో శ్రేయస్సును, సంపదను పొందడానికి ప్రతిరోజూ శ్రీమహావిష్ణువును, లక్ష్మీ దేవిని ఆరాధించడం మంచిది. ఈ ఇద్దరి అనుగ్రహం ఉంటే జీవితంలో డబ్బుకు కొదవే ఉండదు.

కానీ కొన్ని పనులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాయి. దీనివల్ల మీరు మీ జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలగక పోగా ఆగ్రహానికి లోనవ్వక తప్పదు. అయితే చాలామంది డబ్బును లెక్కించేటప్పుడు లాలాజలాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుంది. అంతేకాకుండా ఇది లక్ష్మీదేవికి కోపం కూడా తెప్పిస్తుంది. దీనివల్ల మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

చాలా మంది హడావుడిగా ఉన్నప్పుడు లేదా బస్ లో వెళుతున్నప్పుడు, లేదా ఏదైనా కొన్నప్పుడు డబ్బును జేబులో ముడిచిపెడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఇది లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుంది. కొంతమంది ఇంట్లో డబ్బులు ఎక్కడకు పోతాయిలే అని ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. వాస్తు ప్రకారం.. ఇది లక్ష్మీదేవికి అవమానంగా కూడా పరిగణించబడుతుంది. దీనివల్ల మీరు చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా మనం పడుకునే బెడ్ మీద తొక్కే ప్రదేశంలో డబ్బులు ఉంచరాదు.