Lakshmi Devi: ఉదయం ఇల్లు ఊడ్చేటప్పుడు ఇలా చేస్తే చాలు.. లక్ష్మి కటాక్షం కలగడం ఖాయం!

హిందూమతంలో చీపురుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే చీపురు విషయంలో తెలిసి తెలియకుండా

  • Written By:
  • Publish Date - March 25, 2024 / 10:39 PM IST

హిందూమతంలో చీపురుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే చీపురు విషయంలో తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు చేయకూడదని చెబుతూ ఉంటారు. అలాగే చీపురుతో ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కొన్ని రకాల పనులు చేస్తే మంచిదని కూడా పండితులు చెబుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో చీపురుని ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఇప్పుడు కొన్ని తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీ మీ ఇంటే నివసిస్తుంది. పేదరికంలో ఉన్న వారి పేదరికం కూడా తొలగిపోతుంది. అయితే లక్ష్మీదేవి మీపై కటాక్షాన్ని చూపించాలంటే చీపురును ఉపయోగించేటప్పుడు ముఖ్యంగా కొన్ని పనులు చేయాలి.

ఇక ఆ మూడు పనులు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా హిందూధర్మం ప్రకారం సూర్యోదయం అయిన తర్వాత చీపురును ఉపయోగించడం అసలు మంచిది కాదు. సూర్యోదయం కాకముందే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే సూర్యోదయమైన తరువాత ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసించడానికి ఇష్టపడదు. కనుక ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే చీపురును వాడాలనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక కొంతమంది చీపురును ఉపయోగించేటప్పుడు దాన్ని కాలి కింద వేసి తొక్కుతూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. చీపురును లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి చీపురుని కాలి కింద వేసే తొక్కితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది.

వారి ఇంట లక్ష్మి వెళ్లిపోయి అలక్ష్మీ తాండవిస్తుంది. పొరపాటున మీ కాలికి చీపురు తగిలిన చీపురుని మొక్కి తప్పును క్షమించమని అడగాలి. ఇక ఉదయం ఊడ్చిన తర్వాత చీపురును శుభ్రంగా పెట్టుకోవాలి. మురికి చీపురు దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది. కాబట్టి చీపురును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. అంతేకాదు చీపురుతో ఊడ్చే భాగాన్ని ఎప్పుడు పైకి పెట్టకూడదు. ఊడ్చే భాగం ఎప్పుడు కిందకి ఉండేలా చూసుకోవాలి. అలాకాకుండా ఊడ్చే భాగాన్ని పైకి పెడితే ఇంట్లో గొడవలు ఏర్పడతాయి. అంతేకాదు చీపురును ఎల్లప్పుడూ పడమర దిశలో ఉన్న గదిలోనే పెట్టాలి. ఈ నియమాలను జాగ్రత్తగా పాటిస్తే లక్ష్మీదేవి మిమ్మలను కరుణిస్తుంది. మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తుంది.