Site icon HashtagU Telugu

Vasthu Tips: వంటిట్లో పొరపాటున కూడా ఈ వస్తువులు అస్సలు ఉంచకండి.. ఉంచారో అంతే సంగతులు?

Vasthu Tips

Vasthu Tips

సాధారణంగా చాలామంది వంటింట్లో తెలిసి తెలియక కొన్ని రకాల వస్తువులను పెడుతూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వంటింట్లో కొన్ని రకాల వస్తువులను అస్సలు పెట్టకూడదు. వాస్తు ప్రకారంగా అంత మంచిది కాదు. మరి వంటింట్లో ఎటువంటి వస్తువులు పెట్టుకోకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వంటింట్లో పెట్టకూడని వస్తువులలో చీపురు కూడా ఒకటి. చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. వంటగది సహా ఇల్లంతటిని శుభ్రం చేస్తారు.

ఆ తర్వాత దానిని ఎప్పుడూ కూడా వంటగదిలో ఉంచుకోకూడదు. అలా ఉంచితే అశుభం. వంటగదిలో చీపురు ఉంచితే ఇంట్లో వారికి అనారోగ్యాలు కలుగుతాయి. అన్నపూర్ణా దేవి అలుగుతుంది. వంటింట్లో ఉంచకూడని వస్తువులలో మందులు కూడా ఒకటి. అలా చెయ్యడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఫలితంగా కష్టాలు, అనారోగ్యాలు, ఆర్ధిక ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఇంట్లో ఎవరు వాడే మందులైనా సరే వంట గదిలో కాకుండా మరెక్కడైనా పెట్టుకోవాలి. అలాగే వంటింట్లో అద్దం ఉండకూడదు. వంట గదిలో అద్దం ఉండడం వల్ల అగ్నికి ప్రతిబింబం ఏర్పడుతుంది.

అందువల్ల అద్దంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది ఇంటికి చాలా హానికరం. వంటగదిలో అద్దం ఉంటే కష్టాలు ఎన్నటికీ తీరవని వాస్తు చెబుతోంది. అలాగే చాలామంది వంటింట్లో వాడే వంట పాత్రలు లేదా ఇతర వస్తువులు పాడైపోయినా, విరిగి పోయానా, రంథ్రాలు పడినా సరే వాటిని పారెయ్యడానికి ఇష్టపడరు. కానీ వాస్తు ఇలా పాడైపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం అశుభం. వంటగదిలో పాడైపోయిన వస్తువులు, పనికిరాని పాత్రల వంటి వ్యర్థాలు ఉంచుకోకూడదు. వంటింట్లో ఉండాల్సిన పదార్థాలలో ఉప్పు ఒకటి. అలాగే పసుపు కూడా తప్పకుండా ఉండాలి..బియ్యం కూడా ఉండాలి.