Site icon HashtagU Telugu

Vastu Tips For Kitchen: వాస్తు శాస్త్రం ప్రకారం వంటిల్లు ఇలా ఉంటే ఎంతో మంచిది.. పూర్తిగా తెలుసుకోండి!

Vastu Tips

Vastu Tips

సాధారణంగా స్త్రీలు వంటగదిని లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది వంటగది విషయంలో అనేక రకాల జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉంటారు. మరి కొంతమంది స్త్రీలు అయితే స్నానం చేయకుండా వంటింట్లోకి అసలు అడుగు కూడా పెట్టరు. అయితే వంటగదిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా పెట్టుకోవాలి అని నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ కొందరు బిజీ బిజీ షెడ్యూల్ వల్ల వంటగదిని కూడా ఎలా పడితే అలా ఇష్టానుసారంగా పెట్టుకుంటూ ఉంటారు. అయితే కేవలం శుభ్రంగా పెట్టుకోవడం మాత్రమే కాకుండా వాస్తు శాస్త్ర ప్రకారం వంటింటికి కొన్ని దిక్కులు స్థలాలు కూడా ఉన్నాయిట.

మరి వాస్తు శాస్త్ర ప్రకారం వంటిల్లు ఏ విధంగా ఉంటే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వంటగదికి దిక్కులు, స్థలాలు, రంగులు చాలా ముఖ్యమైనవి అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ నియమాలు అన్నీ కూడా దక్షిణ పడమర దిశగా ఉండాలట. కాబట్టి ఇంటి నిర్మించుకునేటప్పుడు వంటగదిని దక్షిణా పడమర దిశగా అమర్చుకుంటే మంచిది. లేకపోతే తూర్పు ఉత్తర దిశలో కూడా అమర్చుకోవచ్చు. అయితే కిటికీలను పడమర దిశగా ఉండే విధంగా కట్టించుకోవాలి.

ఆ విధంగా వంటింటిని నిర్మించుకున్న తర్వాత అందులోకి కావాల్సిన వస్తువులను దక్షిణ పడమర దిశగా ఉండే విధంగా అమర్చుకోవాలి. మరీ ముఖ్యంగా స్త్రీలు వంట చేసే దిశా పడమర దిశగా ఉండే విధంగా చూసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. స్టవ్ దక్షిణా, పడమర దిశగా ఉన్నప్పుడు, సింక్ ని ఉత్తర,తూర్పు దిశగా అమర్చుకోవాలి. వీటన్నిటితో పాటు వంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఇల్లు కూడా అంతే సంతోషంగా ఉంటుంది.