ప్రతి ఒక్కరి ఇంట్లో వంటగది అన్నది తప్పనిసరిగా ఉంటుంది. వంటగది వాస్తు శాస్త్ర ప్రకారంగా ఉండటం వల్ల మరిన్ని మంచి ప్రయోజనాలు మనకు లభిస్తాయి. అంతేకాకుండా వాస్తు ప్రకారంగా వంట గదిని నిర్మించడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు. వంటగది వాస్తు సరిగా లేకుంటే చాలా కష్టం. దాని వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వంటగదిలో మనం చేసే తప్పుల వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దీనితో పాటు మీ ఆరోగ్యం కూడా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. కాబట్టి కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలి. ఈ వాస్తు ప్రకారంగా వంటగది ఎలా ఉండాలి? ఏ దిశలో ఉండాలి అన్న విషయానికి వస్తే.. వంటగదిని అంగారకుడు పాలిస్తాడు దక్షిణామూర్తి కూడా ఈ ప్రదేశాన్ని పాలిస్తాడు.
అలాగే వంటగది ఇంట్లో ప్రధానంగా కత్తులు, పాత్రలు, మసాలాలు ఉంటాయి. కాబట్టి వంటగది ఆగ్నేయ దిశలో ఉంటే చాలా మంచిది. వంటగది ఆగ్నేయం లేదా వాయువ్య దిశలో ఉంటే మంచిది. వంటగది వాయువ్య దిశలో ఉంటే గ్యాస్ ఆగ్నేయ దిశలో ఉండాలి. అలాగే, దాని తలుపు ప్రధానంగా ఉత్తర లేదా తూర్పు దిశలో ఉండాలి. వంటగది కిటికీలు తూర్పు లేదా పడమర ముఖంగా ఉంటే మంచిది. దాంతో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. అలాగే ప్రధాన సిలిండర్‌ను ఆగ్నేయ దిశలో ఉంచి ఖాళీ సిలిండర్‌ను నైరుతి దిశలో ఉంచడం మంచిది. అలాగే కిచెన్ లో మసాలాలు, ధాన్యాలు, పప్పులు వంటి వంటకు ఉపయోగించే పదార్థాలను దక్షిణం లేదా పడమర దిశలో ఉంచితే మంచిది.
అలాగే వీటిని ఉంచే క్యాబినెట్ దక్షిణం లేదా పడమర ముఖంగా ఉంటే ఇంకా బాగుంటుంది. వాటర్ ఫిల్టర్ ఈశాన్య దిశలో ఉండాలి. ఫ్రిజ్ దక్షిణం లేదా ఉత్తరం వైపు ఉండడం మంచిది..పూజ గది ,వంటగది ఇంట్లో చాలా ముఖ్యమవి. కాబట్టి వాటిని ఎప్పుడూ ఒకదానితో ఒకటి పోల్చకూడదు. అలాగే కిచెన్ దగ్గర బాత్ రూం, టాయిలెట్ ఉండకూడదు. అలాగే ఎప్పుడు వంటగది ఉత్తర దిశలో ఉంటేనే మంచిది. దీని వల్ల వాస్తు దోషం కలుగుతుంది. అలాగే కుబేరుని కోనేరు ఉత్తరదిశలో ఉండడం వల్ల కుజుడు, ఉత్తర దిక్కు ఏర్పడదు. ఇది సంపద సమస్యగా మారుతుంది.