Shankha Puja: ఇంట్లో శంఖం పెట్టుకోవచ్చా.. ఏ ప్రదేశంలో పెట్టాలి.. ఎలాంటి నియమాలు పాటించాలి?

సాధారణంగా మనం ఇంట్లో కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవాలి అంటే ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తాము. ఇలా సందేహం వ్యక్తం చేసే వాటిలో శంఖం ఒకటి.

  • Written By:
  • Publish Date - August 1, 2022 / 07:15 AM IST

సాధారణంగా మనం ఇంట్లో కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవాలి అంటే ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తాము. ఇలా సందేహం వ్యక్తం చేసే వాటిలో శంఖం ఒకటి. చాలామందికి ఇంట్లో శంఖం పెట్టుకోవచ్చా లేదా అనే విషయంపై పెద్ద ఎత్తున సందేహాలు కలుగుతూ ఉంటాయి. అయితే మన హిందూ పురాణాల ప్రకారం శంఖం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. కనుక శంఖం ఇంట్లో పెట్టుకోవడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే శంఖం ఇంట్లో ఉన్నప్పుడు ఆ శంఖం ఉంచే ప్రదేశంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పూజ చేసే విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతున్నారు.

మనం శంఖం కొనుగోలు చేసేటప్పుడు ఒక శంఖం ఎప్పుడు కొనుగోలు చేయకూడదు రెండు శంఖాలు కొనుక్కోవాలి. ఇందులో ఒకటి నీటి శంఖం మరొకటి ఊదడం కోసం ఉపయోగించే శంఖం. పురాణాల ప్రకారం శంఖాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కనుక ఇంట్లో శంఖం ఉండటం వల్ల ఆ ఇంటిలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అయితే మనం శంఖం ఇంట్లో పెట్టేటప్పుడు పూజ గదిలో విష్ణు పాదాల చెంత పెట్టాలి. అయితే ఈ నీటి శంఖంలో ఎల్లప్పుడూ నీరును పోసి పెట్టాలి. ఇక శంఖాన్ని పూజ చేసే ముందు ప్రతిరోజు తప్పనిసరిగా శుభ్రం చేసి పూజ చేయాలి.

ఇకపోతే మనం శంఖం ఉపయోగించకపోతే దానిని నూతన వస్త్రంలోనూ లేదా ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి డబ్బు నిల్వ చేసే చోట పెట్టడం మంచిది. అయితే పొరపాటున కూడా రెండు శంఖాలు ఒకే చోట ఉంచకూడదు. శంఖాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కనుక ఇంట్లో విష్ణువు ఫోటో దగ్గర ఈ శంఖం ఉండడం ఎంతో శుభకరం.ఇలా ఏ ఇంట్లో అయితే శంఖం పూజింపబడుతుందో ఆ ఇంటిలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని, ఆ ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు.