Lakshmi Pooja: శంఖాన్ని ఇలా పూజిస్తే చాలు.. కాసుల వర్షమే?

సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు దేవుళ్ళని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించమని, ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - September 27, 2022 / 06:30 AM IST

సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు దేవుళ్ళని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించమని, ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యల నుంచి గట్టేక్కాలి అంటే శంఖాన్ని ఇంట్లో ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే మన ఇంట్లో శంఖాన్ని దక్షిణ దిక్కుకు ఉంచడం మేలు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది.

ముందుగా మనం శంఖాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు దానిని శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే దాన్ని ఎక్కడ పెట్టాలి. అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించడంతోపాటుగా పక్కనే ఉన్న శంఖాన్ని కూడా పూజించాలి. చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అదేవిధంగా పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా శంఖాన్ని పూజించకుండా పూజ ముగించకూడదు అని చెబుతుంటారు. అందుకే పెద్ద పెద్ద దేవాలయాలలో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు శంఖాన్ని ఉదుతూ ఉంటారు. ఇది ఈ శంఖం ధ్వనికి 2600 అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పి పడిపోతాయట.

అదేవిధంగా శంఖాన్ని రోజు ఊదే వారికి శ్వాస సంబంధిత వ్యాధులు కూడా దగ్గరికి రావు అని వైద్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అలాగే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు శంఖాన్ని తులసీ దళాలతో పూజ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం.