Vastu Tips: కామధేను విగ్రహాన్ని ఇంట్లో ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా?

Vastu Tips: భారతదేశంలో హిందువులు ఆవుని గోమాతగా భావిస్తూ పూజలు కూడా చేస్తూ ఉంటారు. గోమాతను పూజించడం వల్ల సిరిసంపదలు చేకూరతాయని నమ్ముతూ ఉంటారు. పురాతన కాలం నుండే ఆవును సంపద దేవతగా పరిగణిస్తారు.

  • Written By:
  • Publish Date - October 23, 2022 / 07:30 AM IST

Vastu Tips: భారతదేశంలో హిందువులు ఆవుని గోమాతగా భావిస్తూ పూజలు కూడా చేస్తూ ఉంటారు. గోమాతను పూజించడం వల్ల సిరిసంపదలు చేకూరతాయని నమ్ముతూ ఉంటారు. పురాతన కాలం నుండే ఆవును సంపద దేవతగా పరిగణిస్తారు. అయితే చాలామంది ఇంటిలో అలాగే వ్యాపార స్థలాలలో కామధేను విగ్రహాలను పెట్టుకుంటారు. ఈ కామదేను విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిదే కానీ వాటిని శాస్త్ర ప్రకారంగా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో లేదంటే ఆఫీసులలో, వ్యాపార ప్రదేశాలలో ఈ కామదేను విగ్రహాన్ని ఉంచడం వల్ల అదృష్టంతో పాటు శ్రేయస్సు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి .

కామదేవుడు మీ ఇంటి నుండి అన్ని రోగాలను తొలగిస్తాడని విశ్వసిస్తారు. వాస్తు శాస్త్ర ప్రకారంగా కామధేను విగ్రహాన్ని ఈశాన్యం మూలలో ఉంచాలి. ఈ విధంగా ఈశాన్యం మూలలో కామధేను విగ్రహాన్ని పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఈ ఈశాన్య దిక్కు విగ్రహాలను ఉంచడానికి అత్యంత పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తారు. అలాగే ఈ కామధేను గ్రహాన్ని ఉత్తరం లేదంటే తూర్పు దిశలలో కూడా ఉంచవచ్చు. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ముఖ ద్వారం వద్ద కూడా కామధేను విగ్రహాన్ని ఉంచడం అన్నది శుభప్రదంగా పరిగణిస్తారు.

ఈ విధంగా ఇంటి ప్రవేశద్వారం వద్ద కామధేను విగ్రహాన్ని పెట్టడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది. అదేవిధంగా వాస్తు శాస్త్ర ప్రకారం వెండి ఆవు, దూడ విగ్రహాలు చాలా పవిత్రమైనవిగా చెప్పవచ్చు. ఈ విగ్రహాలను దేవుడు గదిలో పెట్టి పూజించవచ్చు. అలాగే ఇత్తడి లేదా రాగితో చేసిన ఆవు దూడ విగ్రహాలను కూడా తీసుకురావచ్చు. వీటిని కూడా ఇంటి ప్రవేశం ముఖ ద్వారం వద్ద ఉంచవచ్చు. అలాగే పిల్లలకి పాలరాతి ఆవు విగ్రహాన్ని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు.