Site icon HashtagU Telugu

Vastu Tips: మనీ ప్లాంట్‌ని పెంచుకుంటున్నారా.. ఈ దిశలో పెడితే కష్టాలు చుట్టుముట్టడం ఖాయం!

Vastu Tips

Vastu Tips

మామూలుగా వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో రకరకాల మొక్కలను చెట్లను పెంచుకుంటూ ఉంటారు. ఇలా పెంచుకోవడానికి శుభప్రదంగా కూడా భావిస్తారు. అటువంటి వాటిలో మనీ ప్లాంట్ మొక్క కూడా ఒకటి. ఒక్క ఇంట్లో మాత్రమే కాకుండా ఆఫీసు స్థలాలలో వ్యాపార ప్రదేశాలలో ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. వాస్తు శాస్త్రాన్ని విస్మరించి ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచుకుంటే మంచి, చెడు ఫలితాలు ఉంటాయట. మనీ ప్లాంట్‌ ను ఇంట్లో తప్పుడు దిశలో ఉంచినట్లయితే లేదా పెంచుకున్నట్లు అయితే చెడు ఫలితాలను పొందడం ప్రారంభిస్తారట. ఈశాన్య దిశలో మనీ ప్లాంట్‌ ను ఎప్పుడూ పెంచుకోకూడదని,ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తప్పవని చెబుతున్నారు.

అయితే మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశలో కాకుండా ఆగ్నేయ దిశలో పెంచుకోవాలట. ఇంట్లో మనీ ప్లాంట్‌ ను నాటడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఒకవేళ మీరు మట్టిలో కాకుండా ఏదైనా బాటిల్లో గాజు పాత్రలో ఈ మొక్కను పెంచుకుంటున్నట్లయితే నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలట. అలాగే ఈ మొక్కను ఎప్పుడు వెళ్ళిపోకుండా చూసుకోవాలట. ఈ మొక్క ఎప్పుడైతే ఎండిపోతుందో ఆ ఇంట్లో ఆనందం సంతోషం ఆవిరి అయిపోతుంది అని చెబుతున్నారు. మనీ ప్లాంట్‌లో కొన్ని ఆకులు ఎండిపోతే వెంటనే వాటిని తొలగించాలి. అంతేకాదు మనీ ప్లాంట్‌లోని తీగ నేలకు తగలకుండా చూసుకోవాలి.

ఇలా జరగడం అశుభం. మీ మనీ ప్లాంట్ మొక్క తీగ నేలను తాకినట్లయితే లేదా దానిని తాకబోతున్నట్లయితే, దానిని ఒక దారంతో పైకి కట్టడం మంచిది. శుక్రవారం రోజు పచ్చిపాలను నీటిలో కలిపి మనీ ప్లాంట్ కు పోయడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయట. మీ ఇంట్లో నాటిన మనీ ప్లాంట్‌ను మరెవరికీ ఇవ్వకండి. మీరు ఇలా చేస్తే మీ ఆనందం మరియు శ్రేయస్సు దెబ్బతింటుంది.