Peacock feather Tips: ఇంట్లో నెమలి ఈక ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

మాములుగా చాలామంది ఇంటిని అందంగా అలంకరించుకోవడం కోసం నెమలి ఈకలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు దేవుడి గదిలో పెట్టి పూజలు కూ

  • Written By:
  • Publish Date - June 27, 2024 / 04:41 PM IST

మాములుగా చాలామంది ఇంటిని అందంగా అలంకరించుకోవడం కోసం నెమలి ఈకలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు దేవుడి గదిలో పెట్టి పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే జాతీయ పక్షి అయిన నెమలిని చంపి వాటి ఈకలను సేకరించడం అన్నది చట్టరీత్యా నేరం. అంతేకాకుండా హిందూమతంలో అనేక జంతువులను, పక్షులను శుభ శకునాలుగా పరిగణిస్తారు. నెమలి గణేశుడు, శ్రీ కృష్ణుడు, కార్తీకేయుడు సహా అనేక ఇతర దేవుళ్లతో ముడిపడి ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. నెమలి ఈకలు ఇంటి అలంకరణలో చాలా ప్రసిద్ధ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం ఇంటిని అలంకరించడానికి నెమలి ఈకలను ఉపయోగిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఒకవేళ ఇంట్లో నెమలి ఈక పెట్టుకుంటే ఏం జరుగుతుంది? నెమలి ఈకను ఇంట్లో ఏ దిశలో పెట్టుకోవడం వలన శుభఫలితాలు వస్తాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసు కుందాం. ఇంట్లో ఏదైనా ప్రతికూల శక్తి ఉందని మీరు భావిస్తే అందుకు నెమలి ఈకలు బెస్ట్ రెమిడీగా చెప్పవచ్చు.

రోజూ ఇంట్లో తగాదాలు, అలజడి, కుటుంబ సమస్యలు ఉంటే నెమలి ఈక అనేక ప్రయోజనాలను ఇస్తుంది. నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ త్వరగా పాజిటివ్‌గా మారుతుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు గణేశ విగ్రహం పక్కన నెమలి ఈకను ఉంచడం శుభప్రదంగా బావిస్తారు. కొన్నిసార్లు ఎంత కష్టపడి పని చేసినా తగిన ఫలితం ఉండదు. రాత్రి పగలు కష్టపడి పనిచేసినా ఆర్ధిక కష్టాలతో ఇబ్బంది పడతారు. రావాల్సిన మొత్తం చేతికి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఎవరికైనా జరిగితే అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి, ఇంట్లో, పనిలో చేసే ప్రాంతంలో నెమలి ఈకను ఉంచండి. ఇలా చేయడం వలన అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఎవరైనా నరదృష్టి , దిష్టి దోషంతో బాధపడుతుంటే జీవితంలో కష్టాలు నష్టాలతో ఇబ్బంది పడుతుంటే ఇంట్లో నెమలి ఈకను అందరికీ కనిపించే చోట ఉంచాలి. ఇలా చేయడం వలన దిష్టి దోషం పోతుందని నమ్మకం. పిల్లలు చదువు విషయంలో నెగ్లెక్ట్ గా ఉంటే అప్పుడు పిల్లలు చదువుకునే గదిలో లేదా చదివే చోట నెమలి ఈకలను పెట్టవచ్చు. ఇలా చేయడం వలన పిల్లలకి చదువు పట్ల శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుంది.