Site icon HashtagU Telugu

Vastu Tips: వాస్తు ప్రకారం వంటగదిలో ఫ్రిడ్జ్ ఏ దిక్కులో ఉండాలి? ఎలాంటి నియమాలు పాటించాలి?

Vastu Tips For Fridge

Vastu Tips For Fridge

వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు కొందరు అయితే నమ్మని వారు కొందరు ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే జీవితంలో విజయం సాధించిన వారు వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతూ ఉంటారు. అందువల్లే ఈ మధ్యకాలంలో వాస్తు శాస్త్ర నిపుణులకు వాస్తు శాస్త్రానికి బాగా డిమాండ్ పెరిగిపోయింది. అయితే వాస్తు శాస్త్రాలను ఇంట్లో ఆఫీసులలో అలాగే ముఖ్యమైన ప్రదేశాలలో కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉండాలి. అదే విధంగా మన ఇళ్లలో ఉండే ప్రధానమైన వస్తువులను వాస్తు ప్రకారం అమర్చడం వల్ల ఆర్థిక వృద్ధి సుఖశాంతులు ఉంటాయి.

మరి ఇంట్లో ఉండే ప్రధాన వస్తువుల్లో వంటగ్యాస్ కూడా ఒకటి. హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువులు నిప్పును అగ్ని దేవుడిగా కొలుస్తారు. అయితే అగ్నిదేవుడికి తూర్పు దిక్కు సరైన దిక్కు కాబట్టి తూర్పు దిక్కున ఉంచి వంట చేస్తే చాలా మంచిదట. ఆ విధంగా చేయడం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదురవ్వవు అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ను పడమర వైపుకు ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.

నీటిని పట్టుకోవడానికి పడమరవైపు చాలా సరైన స్థలమని కాబట్టి పడమర వైపుకు ఫ్రిజ్ ను ఉంచాలని చెబుతున్నారు. అంతే కాకుండా చాలా మంది మహిళలు ఇతర ఆహార పదార్థాలను కూడా ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. కాబట్టి పడమరన ఫ్రిజ్ ఉంచాలని చెబుతున్నారు. వంటగదిలో సింక్ ను ఈశాన్యం లో ఉండే మూలన ఉంచాలట. అంతే కాకుండా వంటగ్యాస్ పక్కనే సింక్ ఉండకుండా కాస్త పక్కన ఏర్పాటు చేసేలా చూసుకోవాలని అవి రెండూ ఒకదానికి మరొకటి విరుద్ధమని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.