జీవితంలో ఎన్ని కష్టాలు పడినా కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి అని దేవుడిని ప్రేమించుకుందాం. ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఎటువంటి సమస్యలు ఉండవు అని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కటి కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. అయితే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడానికి వాస్తు ప్రకారం గా కూడా కొన్ని సమస్యలు ఉండవచ్చు. అదిలా అంటే మనం నిర్లక్ష్యం చేసే కొన్ని పనుల వల్ల మనం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మరి మనం చేసి ఎటువంటి పనులు ఆర్థిక సమస్యలకు దారితీస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు మన చేతిలో నుంచి అనుకోకుండా డబ్బు పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ డబ్బును తీసుకొని జేబులో మాత్రమే పెట్టుకోండి. ఇతర ప్రదేశాలలో పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ఎప్పుడైనా ఉదయం సమయంలో మీ ఇంటికి బిచ్చగాడు వస్తే అతని అరవకుండా అతనికి తినడానికి తిండి లేదా తాగడానికి, మీకు చేత అయిన సహాయాన్ని చేసి పంపండి.
అలాగే ఎప్పుడైనా ఎడమ కన్ను ఎక్కువగా అదురుతుంటే డబ్బు సమస్య రాబోతోంది అని అర్థం. ఇందుకోసం శివుడికి కొంచెం నీరుని సమర్పించండి. లేదంటే మీ కుటుంబ శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని ప్రార్థించడం మేలు. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే వెంటనే ఇంట్లోకి వెళ్లి కొంచెం మంచి నీరు తాగి బయటికి వెళ్ళండి. ఇలా చేయడం వల్ల ఒకవేళ ఆర్థిక సమస్యలు వచ్చినాకూడా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.