Site icon HashtagU Telugu

Vastu Tips: ఇంట్లో కరివేపాకు మొక్కను పెంచుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

Mixcollage 02 Jul 2024 08 10 Am 1543

Mixcollage 02 Jul 2024 08 10 Am 1543

మామూలుగా చాలామంది వాస్తు ప్రకారంగా ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇండోర్ మొక్కలు అవుట్డోర్ మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. మీరు కొన్ని రకాల మొక్కలు నాటేటప్పుడు వాటికి సరైనది చేయించుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. లక్ష్మిదేవి అనుగ్రహంతో సిరి సంపదలతో జీవిస్తారు. ఈ నేపద్యంలో వంటల్లో విరివిగా ఉపయోగించే ఔషధాల గని కరివేపాకు మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి సరైన స్థలం ఉందని మనలో చాలామందికి తెలియదు?

మరి వాస్తు శాస్త్ర ప్రకారం కరివేపాకు మొక్కలు ఇంట్లో ఏ దిశలో నాటాలి?ఎలాంటి దిశలో నాటితే ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కరివేపాకు మొక్కను నాటడానికి అనువైన దిశ ఇంటికి పడమర దిశ. ఈ దిశను చంద్రుడి దిశగా కూడా చెబుతారు. కాబట్టి కరివేపాకు మొక్కను పెంచుకోవడానికి అనువైన ప్రదేశం పడమర. ఇక్కడ ఈ మొక్కను పెంచుకోవడం వలన శుభ ఫలితాలను ఇస్తుంది. అనేకాదు నెగెటివ్ ఎనర్జీ తొలగి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే కరివేపాకు మొక్కను పెంచుకుంటున్న ప్రాంతలోకి మురికి నీరు పారుదల లేకుండా చూసుకోవాలి.

సింక్ నుంచి వృధా నీరు పోయే ప్రాంతంలో పొరపాటున కూడా కరివేపాకు నాటవద్దు. కరివేపాకు మొక్కకు చీడ పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గొంగళి పురుగులు వంటివి పట్టకుండా మొక్క ఆరోగ్యంగా పెరిగేలా తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఎప్పుడైనా చీడ పట్టినట్లు కనిపిస్తే ఆ భాగాన్ని వెంటనే తొలగించడం ఉత్తమం. అలాగే ఇంట్లో ఉన్న కరివేపాకు చుట్టూ ఎండిపోయిన, చీడ పట్టిన ఆ ప్రభావం ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులపై తప్పనిసరిగా పడుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. ఇంటి సామరస్య వాతావరణానికి విఘాతం ఏర్పడుతుంది. కరివేపాకు చెట్ల పక్కన కొన్ని రకాల చెట్లను పొరపాటున కూడా పెంచవద్దు. ముఖ్యంగా చింత చెట్టు కరివేపాకు చెట్టు పక్కపక్కన పెంచుకోవద్దు. ఇలా చేయడం శుభకరం కాదు. అది మీ ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.