Site icon HashtagU Telugu

Vastu Tips: బెడ్ రూం వాస్తుని ఇలా సెట్ చేస్తే దంపతులు సంతోషంగా ఉంటారట!

Bedroom Vastu Tips

Bedroom Vastu Tips

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతి ఒక్కటి సరైన పద్ధతిలో ఉంటే.. అన్నీ సవ్యంగా ఉంటాయి. ఒకవేళ వాస్తు ప్రకారం లేకపోతే మాత్రం అన్ని రకాల సమస్యలు వస్తుంటాయి. సాధారణంగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుంటాయి. కావాల్సిన వాళ్లు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలి కానీ గొడవలు మాత్రం ఉండకూడదు. కానీ ఒకవేళ అలా గొడవలు జరుగుతుంటే మాత్రం దానికి కారణం వాస్తు కూడా కావచ్చు. భార్యాభర్తలు సంతోషంగా ఉండటానికి బెడ్ రూం వాస్తును ఎలా సెట్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
ఇంట్లో వాస్తు ప్రకారం బెడ్ రూం నైరుతి దిశలో ఉండాలి. అలా కాకుండా ఆగ్నేయంలో ఉంటే దంపతులకు నిద్రలేమి ఉంటుందని వాస్తు చెబుతోంది. అలాగే ఇంటి మధ్య భాగంలో బెడ్ రూం ఉండకూడదు. ఎందుకంటే ఇది బ్రహ్మస్థానం కాబట్టి అక్కడ బెడ్ రూం ఉండటం అనేది వాస్తుకు విరుద్ధం. ఇక బెడ్ రూంలో పడకను ఉత్తర దిక్కులో ఉండాలని వాస్తు చెబుతోంది.
బెడ్ రూంలో పడుకునే దంపతులు దక్షిణం లేదంటే తూర్పు వైపు తలను పెట్టి పడుకోవాలని వాస్తులో వివరించబడింది. అలాగే బెడ్ రూంలో చెక్కతో తయారు చేసిన బెడ్ మీద పడుకోవాలని.. లోహంతో చేసిన బెడ్ మీద పడుకోకూడదు అని వాస్తు చెబుతోంది. ఒకవేళ లోహంతో చేసిన బెడ్ మీద పడుకుంటే అశాంతి, నెగిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు చెబుతోంది.
ఇక బెడ్ రూంలో పడక మీద భార్య భర్తకు ఎడమ వైపు నిద్రించాలని వాస్తులో వివరించబడింది. ఇక బెడ్ మీద రెండు కన్నా ఎక్కువ దిండ్లు ఉండకూడదని కూడా చెప్పబడింది. బెడ్ రూంని ఎల్లప్పుడూ ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలని, చిందరవందరగా ఉండకూడదని వాస్తు చెబుతోంది. పైన పేర్కొన్న వాస్తు నియమాలను పాటిస్తే భార్యాభర్తలు ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతారట.