Site icon HashtagU Telugu

Vastu Tips: దేవాలయం నీడ ఇంటిపై పడకూడదా.. పడితే ఏం జరుగుతుందో తెలుసా?

Vastu Tips

Vastu Tips

మామూలుగా చాలామంది దేవాలయాలకు సమీపంలో నిర్మించుకుంటూ ఉంటారు. కానీ దేవాలయం నీడ ఇంటిపై పడకూడదని పడితే మంచిది కాదని చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది అవేమీ పట్టించుకోకుండా దేవాలయం సమీపంలోనే ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. మరి ఒకవేళ దేవాలయం సమీపంలో ఇంటిని నిర్మించుకుంటే ఏం జరుగుతుందో, దేవాలయం యొక్క నీడ ఇంటి పై పడితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన చుట్టుపక్కల ఏ దేవాలయాన్ని చూసినా దేవాలయం లోపల చూసినా దైవిక వాతావరణం, ఆలయంలో గంట, భజనల యొక్క శ్రవ్యమైన శబ్దం, ధూపదీపాలు, కర్రల తాజా సుగంధ వాసన ఈ ఆహ్లాదకరమైన కారకాలన్నీ మనలో సానుకూల శక్తిని పెంపొందిస్తాయి.

మనలో చాలా మంది ఏదైనా దేవాలయానికి సమీపంలో ఇంటిని కట్టుకోవాలని భావిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది సానుకూలతను వ్యాప్తి చేస్తుంది. మన జీవనోపాధిలో ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతారు. కానీ అది పూర్తిగా నిజం కాదట. వాస్తు శాస్త్రం ప్రకారం, గుడి దగ్గర ఇల్లు కొనడం వల్ల లేదా నిర్మించడం వల్ల ప్రతికూలమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, పవిత్ర స్థలానికి సమీపంలో ఇంటికి నిర్మించడం లేదా మీరు నివసించడం వంటివి చేయొద్దని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా అనారోగ్యానికి గురైనప్పుడు లేదా మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు లేదా కుటుంబ వివాదాలు వంటివి ఎక్కువగా జరుగుతాయట.

మీరు ఆలయ సమీపంలో నివసించడం వల్ల మీకు సానుకూలం కంటే ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయట. వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంటి ముందు ఆలయం ఉంటే మీ ఇంటిపై గుడి నీడ పడితే, అది మీకు ప్రతికూల ఫలితాలను తీసుకొస్తుందట. ఒకవేళ మీ ఇల్లు అలా ఉంటే మాత్రం మీరు ఆ దేవాలయంలోకి ప్రతిరోజూ వెళ్లి దేవుళ్లకు సంబంధించిన ప్రార్థనలు చేసేలా చూసుకోవాలి.

అలాగే మీరు ప్రతిరోజూ దేవాలయానికి వెళ్లడంతో పాటు ప్రతి అమావాస్య , పౌర్ణమి రోజున దేవుడికి ప్రత్యేక నైవేద్యం సమర్పించాలట. అలాగే ప్రసాదాన్ని ప్రజలకు పంపిణీ చేస్తే మీకు సానుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. మీరు దేవాలయానికి కొంచెం దూరంగా నివసిస్తుంటే, అది మీ బృహస్పతిని బలంగా చేస్తుంది. దీని వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుందట. గంటలు , శంఖాలు మోగించే శబ్దం ఆలయం చుట్టూ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. సుగంధ ద్రవ్యాల సువాసన గుడి లోపల పర్యావరణాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ సానుకూల శక్తి ప్రవాహం మనం ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మన మనస్సుపై నేరుగా ప్రభావం చూపుతుంది.