ఈ రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని అప్పుల భారం పెరిగిపోతుందని బాధపడుతూ ఉంటారు. పీకల్లోతు అప్పుల్లో మునిగి పోయామని తెగ బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు గంగాజలంతో ఈ అద్భుతమైన నివారణలు ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు పండితులు. మరి గంగాజలంతో ఎలాంటి నివారణలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మాములుగా మనం ప్రతి పూజలోనూ గంగాజలాన్ని ఉపయోగిస్తాం. గంగాజలం పవిత్రమైనది మాత్రమే కాకుండా అనేక అద్భుతమైన గుణాలతో కూడి ఉంది. అందుకే గంగాజలంతో జీవితంలో ఉన్న అనేక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి బయటపడడం కోసం, దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి బయటపడడం కోసం, సమస్యలను పరిష్కరించుకోవడం కోసం గంగాజలం ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక ఇత్తడి పాత్రలో గంగాజలాన్ని నింపి గదిలో ఈశాన్యం మూలలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల అప్పుల భారం క్రమంగా తగ్గుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు లేదా పదే వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారు గంగాజలంతో ఆ సమస్యల నుంచి బయటపడతారు.
ప్రతి ఆదివారం సూర్యుడికి గంగాజలాన్ని నివేదించడం, సోమవారాలలో గంగాజలంతో పరమశివునికి అభిషేకం చేయడం చేయాలి. శివుడికి అభిషేకం చేసేవారు ఇత్తడి పాత్రలో గంగాజలాన్ని నింపి అందులో ఐదు బిల్వపత్రాలను ఉంచి శివలింగానికి సమర్పించాలి. ఈ పరిహారాన్ని 40 రోజుల పాటు పాటిస్తే సరైన ఫలితాలు లభించి ఆరోగ్యం మెరుగు పడుతుంది. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉన్న గంగాజలాన్ని తీసుకుని వారిపై చల్లితే వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. గంగాజలం రోజు తాగే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారని ఇది ఎంతో మంచి చేస్తుందని చెబుతున్నారు. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే గంగా జలాన్ని చల్లితే దోషాలు తొలగిపోతాయి. గంగా జలాన్ని ఇంట్లో చల్లడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇక వివాహానికి ఆటంకం కలిగితే ప్రతి రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం చిటికెడు పసుపు కలుపుకొని ఆ నీటిని ప్రతి రోజు స్నానం చేయాలి. ఇలా ఇరవై 21 రోజులపాటు చేసిన తర్వాత వివాహం జరిగే అవకాశం ఉంటుంది.