Site icon HashtagU Telugu

Vasthu Dosha: అప్పుల బాధలతో సతమతమవుతున్నారా.. అయితే ఈ వాస్తు దోషాలను సరి చేసుకోండి?

Mixcollage 17 Mar 2024 07 30 Pm 2794

Mixcollage 17 Mar 2024 07 30 Pm 2794

ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి పదిమందిలో 8 మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ ఆర్థిక సమస్యల కారణంగా మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇంకొందరు దరిద్రం పట్టి పీడిస్తోంది అందుకే డబ్బులు చేతిలో మిగడం లేదు అని దిగులు చెందుతూ ఉంటారు. కొందరు సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయినా కూడా ఫలితం లభించదు. మీరు కూడా అలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఇప్పుడు మేము చెప్పబోయే వాస్తు దోషాలను సరి చేసుకోవాల్సిందే.

ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే వారు ముందుగా ఉత్తర దిశలో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు. సంపదకు అధిపతి అయిన కుబేరుడు ఉన్న దిశలో ఏవైనా తప్పులు చేస్తే అప్పులవ్వడమే కాకుండా, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ఉత్తరం వైపున ఏదైనా భారీ ఫర్నిచర్ పెట్టిన, లేదా ఇతర భారీ వస్తువులను ఉత్తరం వైపున ఉంచినా,ఉత్తర దిశ గోడపైన ఏవైనా వస్తువులను వేలాడదీసిన వాటి ప్రభావం మన ఆర్థిక పరిస్థితి పై తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఇటువంటి దోషాలు చేయకుండా చూసుకోవాలని, ఉత్తరం దిక్కును ఎప్పుడు క్లీన్ గా ఖాళీగా, ఓపెన్ గా ఉంచాలని చెబుతున్నారు.

ఈ వాస్తు దోషాలుంటే సరి చేసుకోండి అంతేకాదు సాధారణంగా దక్షిణం దిశ గోడ కొంచెం ఎత్తుగా, ఉత్తరం దిశ గోడ కొంచెం ఎత్తు తక్కువగా ఉండాలి. అలా కాకుండా అందుకు భిన్నంగా ఉత్తరం వైపు గోడ కొంచెం ఎత్తుగా ఉండి, దక్షిణం వైపు గోడ ఎత్తు తక్కువగా ఉంటే కూడా అప్పుల పాలు అవుతారని, ఆర్థిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇక ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు ఉత్తర దిశను పూర్తిగా మూసేసి, దక్షిణ దిశను ఖాళీగా ఉంచినా కూడా ఇటువంటి ఇబ్బందులే వస్తాయని చెబుతున్నారు. ఇక నైరుతి దిశలో భూగర్భ నీటి ట్యాంకును ఏర్పాటు చేసినా అప్పుల పాలయ్యే అవకాశం ఉందని, ఇటువంటి పనులు చేయకూడదని చెబుతున్నారు.

ఈశాన్య దిశలో ఇవి ఉన్నాయా? చెక్ చేసుకోండి ఇక ఇంటికి ఈశాన్య దిశలో ఏవైనా యంత్ర పరికరాలు పెట్టి వాటిని వినియోగిస్తున్నా వాస్తు దోషమేనని చెబుతున్నారు. ఈశాన్య దిశలో పొరపాటున కూడా బరువైన యంత్ర పరికరాలు పెట్టకూడదని, ఒకవేళ పెట్టినట్లయితే మన జీవితం పైన కూడా ఆర్థిక ఇబ్బందులు అంతే భారంగా మారతాయని సూచిస్తున్నారు. ఇక అప్పులపాలై ఇబ్బందులు పడుతున్న వారు అప్పుల నుండి విముక్తి పొందడం కోసం ఇంటికి సంబంధించి ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య దిక్కుల విషయంలో జాగ్రత్తలు వహించాలని చెబుతున్నారు.

Exit mobile version