Vastu Tips: ఇంట్లో మనీ ప్లాంట్ ను ఈ వైపు పెడితే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 02:00 PM IST

ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరి ఇళ్ళలో మనీ ప్లాంట్ తప్పనిసరిగా ఉంటోంది. ఇళ్లతో పాటు ఆఫీసులలో అలాగే వ్యాపార ప్రదేశాలలో కూడా ఈ మనీ ప్లాంట్ ను పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ ఇంటిని అందంగా ఉంచడంతో పాటు వాస్తు పరంగా కూడా ఇది ఇంట్లో శ్రేయస్సును కొనసాగించడంలో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఉంటారు. మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్మకం. అలాంటి మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచితే చాలు డబ్బు అకస్మాత్తుగా వస్తుంది అంటున్నారు పండితులు.

అయితే వాస్తు శాస్త్రంలో తులసి, మనీ ప్లాంట్ వంటి కొన్ని మొక్కలను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే, ఈ చెట్లను నాటేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. అయితే, ఈ చెట్లను నాటేటప్పుడు పర్యావరణ నియమాలను కూడా గుర్తుంచుకోవాలి. ఇంట్లో మనీ ప్లాంట్‌ను నాటడం వల్ల ఇంట్లో ఆనందం , శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. అందుకే చాలామంది ఇంట్లో ఈ మొక్కలను నాటుతూ ఉంటారు. కానీ ఈ చెట్టును సరిగ్గా ఉంచకపోతే ఇంట్లో పేదరికం తగ్గుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను ఇంటికి ఈశాన్య భాగంలో అంటే ఈశాన్యంలో పెట్టకూడదు.

కాబట్టి ఈ దిశలో మనీ ప్లాంట్ పెట్టడం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఇలా కాకుండా మనీ ప్లాంట్‌ను ఇంటికి పడమర, తూర్పు వైపున నాటకూడదు. నమ్మకం ప్రకారం, ఈ దిశలో మనీ ప్లాంట్‌ను ఉంచడం వల్ల ఒక వ్యక్తి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటాడు. వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటికి ఆగ్నేయ భాగంలో అంటే అగ్ని మూలలో మనీ ప్లాంట్లను నాటడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో మనీ ప్లాంట్‌ను నాటడం వల్ల సంతోషం శ్రేయస్సు పెరుగుతుంది.
మనీ ప్లాంట్లను నాటేటప్పుడు, ప్రత్యేక శ్రద్ధ వహించండి. నేలను తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నేలను తాకడం అశుభం. కాబట్టి అది పెరగడం ప్రారంభించినప్పుడు, దానిని జాగ్రత్తగా చూసుకోండి. ఈ మొక్క ఎప్పుడూ ఎండిపోకూడదు. దానిని జాగ్రత్తగా చూసుకోండి. మనీ ప్లాంట్ ఎండిపోతే అది చాలా అశుభంగా పరిగణించబడుతుంది. మీకు డబ్బు చేతికి రావచ్చు.