Vastu Tips: రాత్రి పడుకునే ముందు తల దగ్గర వీటిని పెట్టుకుని పడుకుంటున్నారా.. ఆర్థికంగా నష్టపోవడం ఖాయం?

మనలో చాలా మందికి రాత్రి పడుకొని నిద్రపోయేటప్పుడు తల పక్కన కొన్ని రకాల వస్తువులు పెట్టుకొని పడుకోవడం అలవాటు. అయితే అలా పెట్టుకొని పడుకోవడం

Published By: HashtagU Telugu Desk
Mixcollage 07 Feb 2024 01 33 Pm 7810

Mixcollage 07 Feb 2024 01 33 Pm 7810

మనలో చాలా మందికి రాత్రి పడుకొని నిద్రపోయేటప్పుడు తల పక్కన కొన్ని రకాల వస్తువులు పెట్టుకొని పడుకోవడం అలవాటు. అయితే అలా పెట్టుకొని పడుకోవడం అసలు మంచిది కాదు అంటున్నారు పండితులు. ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికపరంగా కొన్ని రకాల వస్తువులను తల పక్కన పెట్టుకొని పడుకోకూడదట. మరి తల పక్కన ఎలాంటి వస్తువులు పెట్టుకొని పడుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తల దగ్గర పర్సులు పెట్టుకుని పడుకునే వారికి ఇబ్బందులు వస్తాయి. ఇలా పెట్టుకుంటే ఖర్చులు అనవసరంగా పెరుగుతాయట. కాబట్టి పర్సులు, డబ్బులు వంటి వాటిని అల్మరాలో పెట్టుకుని ప్రశాంతంగా పడుకోవాలి.

అంతే కానీ తల దగ్గర పొరపాటున కూడా డబ్బులు, పర్సులు వంటివాటిని పెట్టుకోకూడదట. చాలామంది తలదగ్గర దిండు కింద మెడలోని గొలుసులు, తాళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇలా చేసేవారికి జీవితంలో కష్టాలు వస్తాయట. ఏ పని చేసినా ప్రతిబంధకాలు ఎదురవుతాయి. చాలామందికి రాత్రి సమయాల్లో పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. అయితే రాత్రివేళల్లో చదివిన పుస్తకాలను, మ్యాగజైన్లను పొరపాటున కూడా తలకింద పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది పడుకునే ముందు బెడ్ పక్కనే వాటర్ బాటిల్స్ ను పెట్టుకొని పడుకుంటూ ఉంటారు.

అయితే అది మంచిది కాదని కాదు. అది మన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చాలా మంది పడుకునే ముందు వాచ్ లు, ల్యాప్ టాప్ లు, ఫోన్లు వంటి వాటిని తల దగ్గర పెట్టుకుని పడుకుంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి పొరపాటున కూడా ప్రతికూలతలు కలిగించే ఈ వస్తువులు పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకోకండి.

  Last Updated: 07 Feb 2024, 01:34 PM IST