Site icon HashtagU Telugu

Vastu Tips: ఇంట్లో ఫ్రిడ్జ్ పైన అలాంటి వస్తువులు పెడుతున్నారా.. అయితే జాగ్రత్త?

Mixcollage 06 Feb 2024 02 11 Pm 853

Mixcollage 06 Feb 2024 02 11 Pm 853

ప్రస్తుతం ప్రతి ఒక్కరు వారీ ఇళ్లలో రిఫ్రిజిరేటర్ ను తప్పకుండా వినియోగిస్తున్నారు. ఈ రోజుల్లో ఈ రిఫ్రిజిరేటర్ల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. పెద్ద పెద్ద ఇలలో ఒకే ఇంట్లో రెండు ఫ్రిడ్జ్ లు ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే చాలామంది ఇళ్లల్లో రిఫ్రిజిరేటర్ పైన రకరకాల సామాన్లు పెడుతూ ఉంటారు. ఫ్రిడ్జ్ పైన ఇష్టారాజ్యంగా ఏది పడితే అది పెడుతూ ఉంటారు. అలా ఫ్రిజ్ పై ఇష్టారాజ్యంగా సామాన్లను పెడితే వాస్తు దోషాలు తలెత్తుతాయని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు. సహజంగా కిచెన్లో ఫ్రిజ్ పెట్టిన చోటు కూడా వాస్తు నియమాలను అనుసరించి ఉండాలి. ఇక అటువంటప్పుడు ఫ్రిజ్ లో పెట్టే వస్తువుల పైన, అలాగే పైన పెట్టే వస్తువులపైన కూడా వాస్తు నియమాలు ఉంటాయి.

ఫ్రిజ్ పైన పెట్టకూడని వస్తువులు పెడితే ధన నష్టం జరుగుతుంది.మరి రిఫ్రిజిరేటర్ పైన పెట్టకూడని వస్తువులు ఏంటి? కాగా ఇంట్లో రిఫ్రిజిరేటర్ పెట్టుకోవడానికి కూడా వాస్తు నియమాలు ఉంటాయి. రిఫ్రిజిరేటర్ ను ఎల్లప్పుడూ గోడకు కనీసం ఒక అడుగు దూరంలో పశ్చిమ దిశలో లేదా నైరుతి దిశలో పెట్టుకోవాలి. ఇంట్లో ఆనందం శాంతిని కొనసాగించడానికి ఈ దిశలోనే రిఫ్రిజిరేటర్ ను పెట్టాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలా మంది రిఫ్రిజిరేటర్ పైన డబ్బు, బంగారం వంటి వాటిని పెడుతూ ఉంటారు. ఎవరైనా డబ్బులు ఇస్తే ఫ్రిజ్ మీద పెట్టేస్తారు. ఇలా చేస్తే భవిష్యత్తులో వారు డబ్బు నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఫ్రిజ్ పైన డబ్బులు, బంగారం వంటివాటిని పెడితే వ్యాపారంలో కూడా నష్టం జరిగే అవకాశం ఉంది.

ఇక చాలా మంది తమ పిల్లలకు వచ్చినటువంటి ప్రైజులు,పథకాలు, మొమెంటోలు ఫ్రిజ్ పైన పెడుతూ ఉంటారు. కానీ అలా చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ అలా చేస్తే దాని ప్రభావం కూడా ఆ కుటుంబంపై తప్పకుండా పడుతుంది. చాలామంది ఫ్రిజ్ పై నిత్యం వారు వేసుకోవలసిన మందులు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదు. రిఫ్రిజిరేటర్ పైన మందులు పెట్టడం వల్ల వాటి ప్రభావం తగ్గుతుంది. ఫ్రిజ్ నుంచి వచ్చే వేడి మందుల పైన ప్రభావం చూపిస్తుంది. ఇక చాలామంది అలంకరణ కోసం ఫ్రిజ్ పైన గ్లాస్ జార్లో చిన్న వెదురు మొక్కలను పెడతారు. అయితే అది ఏమాత్రం ప్రయోజనాన్ని చేకూర్చదు. వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కను ఫ్రిజ్ పై పెట్టడం మంచిది కాదు. కాబట్టి రిఫ్రిజిరేటర్ పైన ఖాళీ ఉందని ఏ సామాను పడితే ఆ సామాను నింపకూడదు.