Vasthu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులను బదులుగా అసలు ఇవ్వకండి.. ఇచ్చారో!

మనలో కొంతమందికి దానం చేసే గుణం ఉంటే, మరి కొంతమంది బదులుగా ఇస్తూ ఉంటారు. కొందరు మాత్రం ఎటువంటి సహాయం అయినా కూడా ము

  • Written By:
  • Updated On - March 5, 2024 / 07:32 AM IST

మనలో కొంతమందికి దానం చేసే గుణం ఉంటే, మరి కొంతమంది బదులుగా ఇస్తూ ఉంటారు. కొందరు మాత్రం ఎటువంటి సహాయం అయినా కూడా ముఖం మీద లేదు అని చెప్పేస్తూ ఉంటారు. అయితే దానమైనా, బదులైనా వాస్తు శాస్త్ర నియమాలను అనుసరించి నడుచుకుంటే మంచి జరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అయితే వాస్తు శాస్త్రంలో కొన్ని వస్తువులను ఇవ్వకూడదని సూచించబడింది. మరి వాస్తు శాస్త్రంలో ఎవరికి ఇవ్వకూడని వస్తువులు ఏంటి? ఎందుకు ఇవ్వకూడదో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే పొరపాటున కూడా దానం చెయ్యకూడని వస్తువులు ఏవి అన్న విషయానికి వస్తే.. వాస్తుశాస్త్రంలో దానం చేయడానికి మంచి లక్షణంగా సూచించారు.

దానధర్మాలు చేయడం సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తాయి. చెప్పబడింది. అయితే కొన్ని వస్తువుల విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంది. కొన్ని వస్తువులు పొరపాటున దానం చేసినా, బదులుగా ఇచ్చినా ఆర్థికంగా నష్టపోతారని, ఏ మాత్రం కలిసి రాదని చెప్పబడింది. ఇక ఏ ఏ విషయాల్లో మనం బదులు కానీ, దానం కానీ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అంటే. చేతి గడియారం లేదా వాచ్.. మన చేతి గడియారాన్ని పొరపాటున కూడా ఎవరికి ఇవ్వకూడదు. చేతి గడియారం మంచి, చెడు అదృష్టంతో ముడిపడి ఉంటాయి. మనం క్రమం తప్పకుండా ధరించే వాచ్ ను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే అది మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

ఇక తీసుకున్న వారు కూడా ఒక్కోసారి చేతి గడియారం తీసుకోవడం వల్ల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దువ్వెన దానం చేసినా, బదులు ఇచ్చినా ఏం జరుగుతుందంటే ఇక ఇతరుల వద్ద నుండి తీసుకోకూడని మరొక వస్తువులో దువ్వెన ముఖ్యమైనది. ఎవరి వద్దనైనా దువ్వెనని తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు. దాన్ని బదులుగా కానీ, దానంగా కానీ తీసుకోకూడదు. ఇది మీ అదృష్టాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. మీరు ఈ వస్తువులను ఒకవేళ ఎవరికైనా దానమిస్తే మీరు చేసే పనిలో కొంత భాగాన్ని కూడా వారికి ఇచ్చినట్టే అవుతుందని చెబుతున్నారు.

కాబట్టి దువ్వెన విషయంలోనూ ఎవరికి ఇవ్వకుండా, ఎవరి వద్ద తీసుకోకుండా జాగ్రత్త పడడం మంచిది. అలాగే వాస్తు శాస్త్రంలో చీపురుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చీపురులో సంపదల దేవత అయిన లక్ష్మీదేవి నివసిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. అందుకే పొరపాటున చీపురును ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఎవరి దగ్గర నుంచి చీపురుని తెచ్చుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆర్థిక పరిస్థితిని నేరుగా ప్రభావితం చేస్తుందని, అనుకోని ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.అలాగే ఉప్పు, పెన్ను లాంటివి దానం చేయడం బదులుగా తీసుకోవడం లాంటివి కూడా చేయకూడదు.