Site icon HashtagU Telugu

Vastu Tips: చీకటి పడిన తర్వాత పొరపాటున కూడా ఈ వస్తువులు అస్సలు దానం చేయకండి?

Mixcollage 24 Feb 2024 09 49 Pm 7864

Mixcollage 24 Feb 2024 09 49 Pm 7864

హిందువు మతంలో దానధర్మాలు చేయడం అన్నది గొప్పగా పరిగణించబడింది. దానధర్మాలు చేయడం మంచిదే. ఇలా చేయడం వల్ల ఆ దైవానుగ్రహం కలిగి మరింత ఉన్నత స్థాయికి ఎదగడం సమస్యల నుంచి గట్టెక్కడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనకు ఉన్నంతలో ఇతరులకు ఏమీ లేని వారికి దానధర్మాలు చేయడం చాలా మంచి పని అని చెప్పవచ్చు. అలాగే దానధర్మాలు చేసేటప్పుడు ఒక సమయం సందర్భాన్ని పాటించాలి. అదేంటి అనుకుంటున్నారా.. దానధర్మాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని సార్లు అవి మన ఆర్థిక పరిస్థితి పై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక కొన్ని వస్తువులను దానం చేయడం కూడా మంచిది కాదు. కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సంపదని కోల్పోయే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా సాయంత్రం వేళ అనగా చీకటి పడిన తర్వాత కొన్ని రకాల వస్తువులను దానం చేయడం అస్సలు మంచిది కాదు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సూర్యాస్తమయం తర్వాత ప్రతి ఒక్కరు కొన్ని దానాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఎవరూ పాలు, పెరుగు వంటి వాటిని దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. హిందూ ధర్మంలో పాలు చాలా పవిత్రమైనవిగా, లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే పొరపాటున కూడా సూర్యాస్తమయం తర్వాత పాలు పెరుగు, దానం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది. డబ్బుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సూర్య సమయం తర్వాత దానం చేయకుండా ఉండవలసిన మరొక ముఖ్యమైన వస్తువు పసుపు. పసుపు బృహస్పతి గ్రహానికి సంబంధించినది.

పసుపును అనేక శుభకార్యాలలో ఉపయోగిస్తారు. పసుపు లేకుండా ఎటువంటి ప్రత్యేక పూజలు పూర్తికావు. ఇక అటువంటి పసుపును సాయంత్రం చీకటి పడిన తర్వాత దానం చేస్తే జాతకంలో బృహస్పతి బలహీనమవుతారు. బృహస్పతిని సంపద గ్రహంగా పరిగణిస్తారు. అటువంటి సంపద గ్రహానికి చిహ్నమైన బృహస్పతి కి సంబంధించిన పసుపును చీకటి పడిన తర్వాత దానం చేయడం వల్ల ధన నష్టం సంభవిస్తుంది. లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది. సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదని మరికొన్ని వస్తువులను చూసినట్లయితే వెల్లి పాయలు, ఉల్లిపాయలను కూడా పొరపాటున కూడా చీకటి పడిన తర్వాత దానం చేయకూడదు. దానధర్మాలను చేయడం మంచిదే అయినప్పటికీ కొన్ని గ్రహాలకు సంబంధించిన కొన్ని వస్తువులను చీకటి పడిన తర్వాత దానం చేస్తే ఆ గ్రహాల ప్రభావం మన పైన కచ్చితంగా ఉంటుంది. అందుకే పొరపాటున కూడా చీకటి పడిన తర్వాత దానాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.