Vasthu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులు ఇంట్లోకి తీసుకురాకండి.. తెచ్చారో రోడ్డు పాలే?

మామూలుగా మనం ఇంటి స్థలం కొనుగోలు చేసినప్పుడు నుంచి ఇల్లు కట్టించి అందులో వస్తువులు అమర్చే అంతవరకు కూడా వాస్తు చిట్కాలను పాటిస్తూ ఉంటాము.

  • Written By:
  • Publish Date - March 6, 2024 / 08:01 AM IST

మామూలుగా మనం ఇంటి స్థలం కొనుగోలు చేసినప్పుడు నుంచి ఇల్లు కట్టించి అందులో వస్తువులు అమర్చే అంతవరకు కూడా వాస్తు చిట్కాలను పాటిస్తూ ఉంటాము. అలా ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని, ఆర్థికంగా తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఫలితంగా బతుకు బజారున పడుతుందని చెబుతుంటారు..అందుకే మనకు తెలిసి తెలియకుండా చేసే దోషాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే వినాశనమే చాలామంది తెలిసీ తెలియక చేసే పొరపాట్ల వల్ల భారీ నష్టాన్ని చవిచూస్తూ ఉంటారు.

అయితే అటువంటి పొరపాట్లకు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడమే కారణంగా మారుతుంది. వాస్తు ప్రకారం మన ఇంట్లో పెట్టుకోకూడని కొన్ని వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఆ ఇల్లు వినాశనాన్ని చూస్తుంది. ఇక ఎటువంటి వస్తువులను ఇంట్లోకి తీసుకు రాకూడదు అనే విషయానికి వస్తే.. ఇంట్లో ఆ దేవత విగ్రహాలను పెట్టుకుంటే జరిగేది ఇదే ఆరు అంగుళాల కంటే ఎత్తైన దేవుడి విగ్రహాలను ఇంట్లోకి తీసుకు రాకూడదు. శాస్త్రం ప్రకారం ఆరు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తున విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏ చిన్న తప్పు జరిగినా ఆ కుటుంబమే నాశనమయ్యే ప్రమాదం ఉంటుంది. ఏకంగా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. దీనికి కారణం 6 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ప్రతిరోజు నియమ,నిష్టలతోటి పూజలు చేయాలి. నైవేద్యం పెట్టాలి.

పొరపాటున కూడా లోప భూయిష్టమైన పూజలు చేయకూడదు. అలా పొరపాటున లోపభూయిష్టమైన పూజలు చేస్తే ఆ కుటుంబమే సర్వనాశనం అవుతుందని చెబుతున్నారు. సాలిగ్రామాలను ఇంట్లో పెట్టుకుంటున్నారా? అయితే తెలుసుకోండి మరొకటి సాలిగ్రామాలను పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. సాలిగ్రామం నేపాల్ లోని గండకీ నది నుండి ఉద్భవించేటువంటి రాయి . ఈ రాయి చాలా శక్తివంతమైనది. ఆకర్షణీయంగా, అందంగా, నునుపుగా మెరుస్తూ తాబేలు నోరు తెరుచుకున్నట్టు ఉండి శ్రీమహావిష్ణువు శేషసాయిగా ఉండి దర్శనం ఇచ్చేటువంటి రాళ్లు సాలిగ్రామాలు. పొరపాటున కూడా విష్ణు యొక్క ప్రతిరూపంగా పరిగణించబడే సాలిగ్రామాలను ఇంటికి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఇంటికి తెచ్చుకుంటే కఠినమైన నియమ నిష్టలను పాటించాలి. ఈ నియమాలను పాటించకపోతే ఆ వ్యక్తి అదృష్టం నశించిపోతుంది.

తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడని మరొకటి ముళ్ళ చెట్లు. ఎట్టి పరిస్థితిలోనూ ముళ్ళ చెట్లను ఇంట్లో పెట్టుకోకూడదు. ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అడుగడుగున ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. వారి జీవితంలో అడుగడుగునా ముళ్ళే ఎదురవుతాయి. సంతోషాన్ని ఇంట్లోకి రానీయకుండా ముళ్ళ చెట్లు అడ్డుకుంటాయి. అందుకే ముళ్ళ చెట్లను ఇంట్లో పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి. అయితే వీటినుంచి గులాబీ మొక్కకు మినహాయింపు ఉంది.