Site icon HashtagU Telugu

Vastu Tips: స్టోర్ రూమ్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఆర్థిక నష్టాలు రావడం ఖాయం?

Mixcollage 02 Feb 2024 07 14 Pm 766

Mixcollage 02 Feb 2024 07 14 Pm 766

మామూలుగా మనం నిత్యం ఉపయోగించే వస్తువులు కొన్ని కొన్ని సార్లు పనిచేయని సందర్భంలో వెంటనే వాటిని స్టోర్ రూమ్ లో వేస్తూ ఉంటాము. పని చేయని వస్తువులు మాత్రమే కాకుండా పని చేస్తే వస్తువులు కూడా అడ్డుగా లేకుండా ఒక స్టోర్ రూమ్ లో పెట్టేస్తూ ఉంటాము. మీకు తెలుసా స్టోర్ రూమ్ విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. స్టోర్ రూమ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఆర్థిక నష్టాలు రావడం ఖాయం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. మరి స్టోర్ రూమ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్టోర్ రూమ్ లో వాస్తు లేకపోతే రాహు, కేతు గ్రహాలు ప్రతికూల ఫలితాలను ఆ ఇంట్లోని వారికి అందిస్తాయి. స్టోర్ రూమ్ లో తుప్పు పట్టిన వస్తువులను ఉంచకుండా చూసుకోవాలి. స్టోర్ రూమ్ లో తుప్పు పట్టిన వస్తువులు పెడితే అవి మన ఆర్థిక ప్రగతికి అడ్డుపడతాయి. ధన నష్టం కలిగిస్తాయి. స్టోర్ రూమ్ లో ఉపయోగపడే వస్తువులు మినహాయించి, పాడైపోయిన వస్తువులను ఉంచవద్దు. అంతేకాదు స్టోర్ రూమ్ లో ఇత్తడి పాత్రలను పడేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇత్తడి పాత్రలో శని దేవుడు నివసిస్తాడు. ఒకవేళ స్టోర్ రూమ్ లో ఇత్తడి పాత్రలను పడవేస్తే శని ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాడు. ఇక స్టోర్ రూమ్ లో పాడైపోయిన వాచ్ లు, కుట్టు మిషన్లు పడేయకకూడదు.

పూజగది సామాన్లను, వంటగది సామాన్లను స్టోర్ రూమ్ లో అసలు ఉంచకూడదు. దీనివల్ల పేదరికం వచ్చి పడుతుంది. స్టోర్ రూమ్ లో కత్తులు, కత్తెరలు వంటి హానికరమైన వస్తువులు పెట్టకూడదు. విరిగిపోయినవి ఏ విధంగాను పనికిరాని వస్తువులను కూడా స్టోర్ రూమ్ లో ఉంచడం మంచిది కాదు. స్టోర్ రూమ్ కదా అని దానిని సర్దకుండా చెత్తాచెదారంతో నింపకూడదు. స్టోర్ రూమ్ ఆ విధంగా ఉంటే కూడా ఇంట్లో దరిద్ర లక్ష్మి తాండవిస్తుంది. స్టోర్ రూమ్ ని కూడా నీట్ గా సర్ది పెట్టుకోండి. అప్పుడే ఇంట్లో ప్రతికూల ఫలితాలు రాకుండా ఉంటాయి. స్టోర్ రూమ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు.