Vastu Tips: సాయంత్రం ఈ 5 రకాల పనులు చేశారో దరిద్రం పట్టిపీడించడం ఖాయం?

మామూలుగా వాస్తు శాస్త్ర ప్రకారం ఉదయం సమయంలో సాయంకాలం సమయంలో కొన్ని రకాల పనులు చేయడం నిషేధించబడింది. ఉదయం సాయంత్రం చేయకూడని

Published By: HashtagU Telugu Desk
Mixcollage 08 Feb 2024 03 35 Pm 8180

Mixcollage 08 Feb 2024 03 35 Pm 8180

మామూలుగా వాస్తు శాస్త్ర ప్రకారం ఉదయం సమయంలో సాయంకాలం సమయంలో కొన్ని రకాల పనులు చేయడం నిషేధించబడింది. ఉదయం సాయంత్రం చేయకూడని పనులను పొరపాటు చేస్తే కూడా వాటి వల్ల అనేక రకాల అనర్ధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణంలో లేదా నిర్వహణలో వాస్తు నియమాలు పాటించకపోతే అది మనలను కష్టాలపాలు చేస్తుంది. సాయంత్రం సమయంలో చేయకూడని పనులు చేయడం వల్ల కూడా వాస్తు దోషాలు కలుగుతాయి. సాయంత్రం పూట కొన్ని తప్పులు చేయడం వల్ల ఇంటి ఆర్థిక శ్రేయస్సు పై చెడు ప్రభావం పడుతుంది.

వాస్తు శాస్త్రంలో సూర్యాస్తమయం తర్వాత చెయ్యకూడని పనులు ఇలా ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ సూర్యాస్తమయం తర్వాత డబ్బులు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. సాయంత్రం తర్వాత ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోకూడదు. సాయంత్రం తర్వాత డబ్బు లావాదేవీలు చేయకుండా ఉంటేనే మంచిది. సూర్యాస్తమయం తరువాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు అని అంటారు. కాబట్టి పొరపాటున కూడా డబ్బును అప్పుగా ఇవ్వద్దు..వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం తర్వాత పొరపాటున కూడా ఇళ్ళు ఊడ్చకూడదు. సాయంత్రం తర్వాత ఇల్లు ఊడవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. అది వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది.

ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఇంటిని ఊడ్వ వలసి వస్తే చెత్తను ఇంటి నుండి బయట పాడెయ్యకూడదు. మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే చెత్తను ఇంటి నుండి బయట పడెయ్యాలి. తులసి మొక్కలో లక్ష్మీ దేవి నివసిస్తుందని చెబుతారు. కాబట్టి సాయంత్రం తరువాత పొరపాటున కూడా తులసి ఆకులను తెంపడం కోయడం లాంటివి చేయకూడదు. ఇలా సాయంత్రం తర్వాత తులసి ఆకులను కోయడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది. సాయంత్రం పూట తులసి ఆకులు కోయటం వల్ల వ్యాధులు, ఆర్థిక సమస్యలు వంటి సమస్యలు చుట్టుముడతాయి. సాయంత్రం పూట తులసిని తాకకుండా దాని ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది. ఇక సాయంత్రం తరువాత ప్రధాన ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు. సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ ను కాసేపు తెరిచి ఉంచాలి.

లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని, ఆ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. సూర్యుడు అస్తమించిన తరువాత ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే ఆ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. అంతేకాదు ఎవరైనా పేదవాడు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే సాయంత్రం తర్వాత ఎప్పుడూ అతన్ని ఖాళీ చేతులతో పంపకండి. మీకు ఉన్నంతలో అతనికి సహాయం చేసి పంపడం మేలు.

  Last Updated: 08 Feb 2024, 03:35 PM IST