Wood: పొరపాటున కూడా ఈ ఇంట్లోకి ఈ 3 చెక్కలను తీసుకురాకండి.. ఎందుకంటె?

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 04:12 PM IST

మాములుగా చాలామంది ఇంటిని అలంకరించడానికి వివిధ రకాల చెక్క వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. వివిధ రకాల చెక్కలతో తయారు చేసిన వస్తువులు ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగంగా ఉన్నప్పటికీ, కొన్ని రకాల చెక్కలను ఇంట్లో ఉపయోగించడం వల్ల అనేక అశుభాలు కలుగుతాయట. కాబట్టి ఏదైనా వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు అవి ఏ చెక్కతో తయారు చేశారో, ఎటువంటి కలపను దానికి ఉపయోగించారో తెలుసుకోవలసిన అవసరం ఉంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అయితే ముఖ్యంగా మూడు రకాల చెక్కలను ఇంట్లోకి అస్సలు తీసుకురాకూడదు అంటున్నారు పండితులు.

ఇంతకీ ఆ మూడు రకాల చెక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..పాలు గారే చెట్ల కలపతో ఇంట్లో వస్తువులు చేస్తే జరిగేది ఇదే కొన్ని రకాలు చెక్కలను ఇంట్లో ఉపయోగించడం వల్ల ఇంట్లో సంపద ఆవిరవుతుందని, అశుభలు కలుగుతాయట.పాలు గారే చెట్లకు సంబంధించిన కలపను ఉపయోగించకూడదు. ఏదైనా చెట్టు కొమ్మ లేదా ఆకులు విరిగిపోయినప్పుడు వాటి నుంచి తెల్లటి రంగు గల జిగట పదార్థం బయటకు వస్తుంటే, అటువంటి చెట్లు ఇంట్లో వస్తువులను తయారు చేసుకోవడానికి పనికిరావు అనేది గుర్తుంచుకోవాలి. ఇవి చాలా అశుభలను కలిగిస్తాయి.

ఇంట్లో వస్తువుల తయారీకి ఈ చెట్లు ఏ మాత్రం పనికిరావు రబ్బరు చెట్లు, యాక్ చెట్లు తెల్లటి జిగట పదార్ధాన్ని స్రవిస్తాయి. కాబట్టి పొరపాటున కూడా ఈ విధంగా పాలుకారే చెట్ల కలపను ఇంట్లో వస్తువుల తయారీకి తీసుకురాకూడదు. అటువంటి చెట్ల కలపతో తయారుచేసిన వస్తువులను కూడా ఇంటికి తేకూడదు. అంతే కాదు బాగా బలహీనంగా ఉండే చెట్లు, ఎండిపోయే చెట్లు ఏదైనా వస్తువు తయారు చేస్తున్నప్పుడు విరిగిపోతూ, పొడిపొడిగా రాలుతున్న చెట్ల కలపని కూడా ఉపయోగించకూడదు. అటువంటి కలపను ఇంట్లో వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించటం మంచిది కాదు. చెదపురుగులు పట్టి, చీమలు పట్టిన చెట్ల కలపను వాడటం మంచిది కాదు. ఇక స్మశాన వాటికలో పెరుగుతున్న చెట్లు ఏదైనా అలంకరణ వస్తువులను తయారు చేయడానికి, విగ్రహాల ఫ్రేమ్ లు తయారు చేయడానికి ఉపయోగించటం మంచిది కాదు.

స్మశాన వాటిక వద్ద ఉన్న చెట్ల కలప ఇంట్లో ప్రతికూలమైన ప్రభావాలను చూపిస్తుంది. ఇల్లు అనేక సమస్యలకు కేంద్రంగా మారేలా చేస్తుంది. ఇంట్లోనే ఆర్థిక శ్రేయస్సును నాశనం చేయడమే కాకుండా, ఇంట్లో అశాంతిని తీసుకువస్తుంది. స్మశాన వాటికలో పెరిగే చెట్లకు సంబంధించి కలపను కూడా ఇంట్లో కాల్చకూడదు. ఏ ఇతర వినియోగాలకు ఆ కలపను వాడకూడదు.