Vastu Tips: పొరపాటున కూడా ఆ రోజుల్లో కొత్త చీపురుని ఇంటికి అస్సలు తీసుకురాకండి?

మనం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే చీపురు విషయంలో వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల విషయాలు చెప్పబడ్డాయి. తెలిసి తెలియకుండా ఈ చీపురు విషయంలో కొన్ని

Published By: HashtagU Telugu Desk
Mixcollage 18 Feb 2024 05 45 Pm 4813

Mixcollage 18 Feb 2024 05 45 Pm 4813

మనం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే చీపురు విషయంలో వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల విషయాలు చెప్పబడ్డాయి. తెలిసి తెలియకుండా ఈ చీపురు విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తే మానసికంగా ఆరోగ్యంగా ఆర్థికపరంగా సమస్యలను ఎదుర్కోవాల్సిందే. మనం ఇంటి నిర్మాణానికి ఇంట్లో పెట్టుకునే వస్తువులు ఏవిధంగా అయితే వాస్తు నియమాలను పాటిస్తామో అదేవిధంగా ఇంట్లో చీపురు విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. అయితే మామూలుగా
చీపురును మహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అటువంటి చీపురును ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తెచ్చుకోకూడదట.

ఇక చీపురును ఎక్కడపడితే అక్కడ కూడా ఎలా పడితే అలా పెట్టకూడదు. చీపురును ఈశాన్యం మూల, ఆగ్నేయ మూలలో పొరపాటున కూడా ఉంచకూడదు. నైరుతి, వాయువ్య మూలలో చీపురును కనిపించకుండా పెట్టాలి. మరి చీపురు విషయంలో ఇంకా ఇలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇక పాత చీపురు పాడైపోయినప్పుడు చీపురును కొనుగోలు చేయాలనుకునే వారు ఎప్పుడు పడితే అప్పుడు కొత్త చీపురును కొనుగోలు చేయకూడదు. శనివారం నాడు కొత్త చీపురును కొనుగోలు చేసుకొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

పొరపాటున కూడా శుక్లపక్షంలో చీపురును కొనుగోలు చెయ్యకూడదు. కేవలం కృష్ణ పక్షంలో మాత్రమే చీపురును కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ పొరపాటున శుక్లపక్షంలో ఎవరైనా చీపురును కొనుగోలు చేస్తే అది దురదృష్టానికి హేతువుగా మారుతుంది. అప్పుడు చీపురు కొన్నవారికి ఊహించని కష్టాలు వస్తాయట.
అంతేకాదు శుక్రవారం నాడు, మంగళవారం నాడు, మహాలయ పక్షం సమయాల్లో అంటే భాద్రపద మాసంలోని పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురును కొనుగోలు చేయడం ఏ విధంగానూ మంచిది కాదు. కాబట్టి పొరపాటున కూడా చీపురుకు సంబంధించిన తప్పులు చెయ్యకూడదు. ఒకవేళ అలా చేస్తే ధనవంతుని కూడా పేదరికం పట్టి పీడిస్తుంది. అందుకే చీపురును కొనుగోలు చేసే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.

  Last Updated: 18 Feb 2024, 05:46 PM IST