Site icon HashtagU Telugu

Vastu Tips: గడియారం ఇంట్లో ఏ దిశలో ఉంటే మంచి జరుగుతుందో మీకు తెలుసా?

Vastu Tips

Vastu Tips

మామూలుగా చాలా మంది ఇంటిని అందంగా అలంకరించడం కోసం స్టైలిష్ గా ఉన్న బొమ్మలు గోడ గడియారాలు వంటివి ఇంట్లో గోడల పై తగిలిస్తూ ఉంటారు. కానీ మనం ఇంట్లో వస్తువులను అమర్చే విషయంలో తప్పకుండా వాస్తు నియమాలనే పాటించాలని పండితులు చెబుతున్నారు. చాలామందికి ఈ విషయం తెలియక వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెట్టి నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు. ఇకపోతే వాస్తు ప్రకారం ఉండాల్సిన వాటిలో గడియారం కూడా ఒకటి. అవునండోయ్ గడియారం వాస్తు ప్రకారం ఒక దిశలో ఉంచడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.

ఇంతకీ గడియారం ఏ దిశలో ఉంచాలి అన్న విషయానికి వస్తే.. వాస్తు శాస్త్రంలో గడియారం ఇంటి ఆర్థిక స్థితితో ముడిపడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఏ రంగు గడియారం తీసుకువచ్చారు. దీని ఆకృతి ఏమిటి అనే విషయానికి ప్రాముఖ్యత పెరుగుతుంది. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం గడియారాన్ని ఉత్తరం, పడమర, తూర్పు దిశలలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. గడియారాన్ని ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో వేలాడదీయకూడదని చెబుతున్నారు. గడియారాన్ని దక్షిణ దిశలో ఉంచడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయట. కాబట్టి గడియారాన్ని ఎప్పుడూ దక్షిణ దిశలో ఉంచకూడదు.

అంతేకాదు గడియారాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచే వీలు ఉంటే ఈ దిశలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గడియారాన్ని ఉంచడానికి పశ్చిమ దిశ కూడా సరైన దిశగా పరిగణించబడదు. అటువంటి పరిస్థితిలో ఎవరికైనా గడియారాన్ని ఉత్తరం, తూర్పు దిశలో ఉంచడానికి స్థలం లేనప్పుడు మాత్రమే పశ్చిమ దిశలో ఉంచాలి. ఉత్తర, తూర్పు దిశలో గడియారాన్ని ఉంచడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఆర్థిక పరిస్థితిని స్థిరంగా ఉంచుతుంది. ఇంటి మెయిన్ డోర్ పైన గడియారాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. అంతే కాదు ఇంటిలోని ఏ తలుపు పైన కూడా గడియారాన్ని పెట్టకూడదు. అలాగే నిద్రించే మంచం గోడపైన కూడా గడియారాన్ని ఉంచకూడదని గుర్తుంచుకోవాలి. ఇది హానిని కలిగిస్తుంది. అశుభకరమైనదిగా పరిగణించబడుతుందని చెబుతున్నారు.