Vasthu Tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా.. దరిద్రం ఖాయం!

చాలామంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కొన్ని రకాల పనులు చేయడం నిషేధంగా భావిస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయ

  • Written By:
  • Updated On - March 17, 2024 / 06:51 PM IST

చాలామంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కొన్ని రకాల పనులు చేయడం నిషేధంగా భావిస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని భావిస్తూ ఉంటారు. అలాగే అవి ఆ ఇంటి గృహస్థుల జీవితాల పై ప్రతికూలమైన ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. చాలా పనులు ఇంట్లో చేయకూడదు అని చెప్పినా అవేవీ లక్ష్య పెట్టకుండా చాలామంది చేస్తూ ఉంటారు. గోళ్ళు కొరకటం, ఇంటి మధ్యలో కూర్చొని జుట్టు దువ్వుకోవడం వంటి అనేక పనులు అనేక నెగిటివ్ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మహిళలు జుట్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది.

చాలామంది మహిళలు నట్టింట్లో కూర్చొని జుట్టు దువ్వుకుంటూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదని ఇంట్లో కూడా మన పెద్దలు తరచుగా చెబుతూ ఉంటారు. ఇంట్లో జుట్టు విరబోసుకొని మహిళలు ఎప్పుడు పని చేయకూడదు. జుట్టు విరబోసుకొని మహిళలు నిద్రించకూడదు. అంతేకాదు మహిళలు నటింట్లో జుట్టు దువ్వకూడదు. వెంట్రుకలు ఇంట్లో పడటం మన పెద్దవాళ్లు అశుభమని చెబుతూ ఉంటారు. అందుకే జుట్టు దువ్వుకునేటప్పుడు మహిళలు ఆరు బయట గాని, వరండాలో కానీ, ఇంటికి దూరంగా కానీ దువ్వుకోవాలి. వెంట్రుకలు నట్టింట్లో పడితే శనిదేవుని ఆహ్వానించినట్టేనని, అది ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుందని చెబుతారు.

జుట్టు విరబోసుకుని మహిళలు ఎదురు వచ్చినా కూడా, ఆ పనులు జరగమని ప్రతికూల ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు. మంగళవారం జుట్టు విషయంలో ఈ పనులు చెయ్యకండి ఇక మంగళవారం నాడు మహిళలు జుట్టు అస్సలు కత్తిరించుకోకూడదు. మంగళవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం, జుట్టు విరబోసుకుని తిరగడం అరిష్టం. మంగళవారం అయితే జుట్టుని ఎక్కువగా కూడా దువ్వకూడదు. మంగళవారం జుట్టు రాలితే ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. నటింట్లో కూర్చొని తల దువ్వుకోవడం, నటింట్లో కూర్చొని పేలు చూసుకోవడం వంటివి ఇంటికి దరిద్రాన్ని తీసుకొస్తాయి.

అందుకే మహిళలు ముఖ్యంగా జుట్టు దువ్వుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున కూడా ఇంట్లో వెంట్రుకలు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. జుట్టు విరబోసుకుని ఈ పనులు చేసినా ఫలితం శూన్య్యం ఇక ఎప్పుడు పడితే అప్పుడు తల దువ్వకూడదని కూడా సలహా ఇస్తున్నారు. ఊడిపోయిన వెంట్రుకలను ఇంట్లో ఎక్కడా పెట్టకూడదని, వాటిని ఇంటికి దూరంగా పడేయాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ వెంట్రుకలు పడితే అవి తినే ఆహారంలో కూడా పడే ప్రమాదం ఉంటుందని, తద్వారా ఆహారం కలుషితం అవుతుందని చెబుతున్నారు.