Site icon HashtagU Telugu

‎Vastu Tips: ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండకూడదా.. అలా ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Vastu Tips

Vastu Tips

‎Vastu Tips: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇంటి దగ్గర పూలు, పండ్ల మొక్కలను పెంచుకుంటున్న విషయం తెలిసిందే. టెర్రస్ గార్డెన్ అంటూ ఇంటిపైన అనేక రకాల చెట్లను పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఇంటి దగ్గర మొక్కలు ఉండటం మంచిదే కానీ కొన్ని రకాల మొక్కలు పెంచుకోవడం అస్సలు మంచిది కాదట. కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణలో పెంచటం వల్ల ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

‎అలాంటి వాటిలో బొప్పాయి మొక్క కూడా ఒకటి. బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండటం మంచిది కాదని చెబుతున్నారు. ఇంటి ముందు బొప్పాయి చెట్టు పొరపాటున పెరిగినా కూడా దాన్ని వెంటనే పీకి మరో చోట నాటాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండటం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందట. కాగా ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెంచటం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత, సంతోషాలు దూరం అవుతాయని చెబుతున్నారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటకూడదట.

‎అయితే వాస్తు ప్రకారం ఇంటి చుట్టు కూడా బొప్పాయి చెట్టును నాటకూడదట. ఎందుకంటే బొప్పాయి చెట్టు అశుభానికి సంకేతంగా భావించాలట ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు వెంటాడుతాయని చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు కలుగుతాయట. బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసంగా భావిస్తారు. అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర, ఇంటి ముందు నాటకూడదని అంటున్నారు. ఇంటి ముందు, ఆవరణలో బొప్పాయి చెట్టు ఉండటం వల్ల పిల్లలకు ఎప్పుడూ బాధలు, కష్టాలు వస్తాయట. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం మంచిది కాదని చెబుతున్నారు. ఒకవేళ ఉన్నా కూడా వాస్తు ప్రకారం చిట్కాలను పాటించడం మంచిది.

Exit mobile version