Vastu Tips: స్థలం కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ విషయాలను గుర్తుంచుకోవాల్సిందే?

  • Written By:
  • Updated On - February 24, 2024 / 10:21 PM IST

మాములుగా మనం ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేసినప్పుడు వాస్తు విషయాలను డబ్బు విషయాలను ఇలా ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని స్థలాన్ని కొనుగోలు చేస్తూ ఉంటాం. అయితే ధరల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం వాస్తు. ఎటువంటి స్థలం కొనుగోలు చేసిన కూడా అందులో వాస్తు విషయాలను తప్పకుండా పాటించాలి. కొనుగోలు చేసిన స్థలానికి వాస్తు లేకుంటే కొనుగోలు చేసిన వ్యక్తి యొక్క జీవితం ఊహించని ఇబ్బందులలో పడుతుంది. ఒక్కొక్కసారి తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థలాల కొనుగోలు విషయంలో జాగ్రత్త తాజాగా ఎటువంటి స్థలాలను కొనుగోలు చేయకూడదు అనేది క్షుణంగా తెలుసుకుందాం..

ముఖ్యంగా బంజరు భూములను, నెర్రెలు ఉన్న స్థలాలను, ఎలుకల బొరియలు, చెదల పుట్టలు, పాముల పుట్టలు ఉన్న స్థలాలను, తవ్వితే ఎముకలు, బూడిద, బొగ్గు వంటివి వంటివి బయటకు వచ్చే స్థలాలను పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు. ఈ స్థలాలను కొనుగోలు చేస్తే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒక్కొక్కసారి జీవితం సర్వనాశనం కూడా అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే ఎటువంటి భూములను కొనుగోలు చెయ్యవచ్చు అన్న అంశాన్ని కూడా వాస్తు శాస్త్రం వివరించింది.ఎటువంటి స్థలాలను మనం నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు అంటే వ్యవసాయం చేయడానికి పనికి వచ్చిన భూములను కొనుగోలు చెయ్యవచ్చు.

పచ్చని చెట్లు, మొక్కలు గడ్డి, పెరిగిన భూములను కొనుగోలు చేయవచ్చు. భూమిని తవ్వితే రాళ్లు, ఇటుకలు, గులకరాళ్లు మొదలైనవి బయటకు వస్తే ఇలాంటి భూములను కొనుగోలు చేయవచ్చు. స్థలానికి నాలుగు దిక్కులలో దీపాలు వెలిగిస్తే అన్ని సమానంగా వెలిగితే అటువంటి భూములను కొనుగోలు చేయవచ్చు. భూమి లక్షణమే కాదు స్థల వాస్తు మర్చిపోకండి స్థలంలో గుంత తీసినప్పుడు ఆ గుంత నుంచి తీసినటువంటి మట్టిని మళ్లీ తిరిగి పూడిస్తే కొంత మట్టి మిగిలి ఉంటే అటువంటి భూములను కొనుగోలు చేయవచ్చు.అయితే భూమి లక్షణంతో పాటు కచ్చితంగా వాస్తుకు అనుకూలంగా ఉందా ? ఏ దిశలో స్థలం ఏ విధంగా ఉంది వంటివి కూడా తెలుసుకోవాలి. మంచి భూమికి ఉండాల్సిన లక్షణాలు ఉండి, వస్తు బాగుంటే ఇలాంటి స్థలాలను కొనుగోలు చేస్తే అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. ఇటువంటి భూములన్నింటిని శుభప్రదంగా పరిగణిస్తారు. వాస్తు లేని స్థలాలను ఊరకనే ఇస్తామన్నా తీసుకోకూడదు కాబట్టి స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు ముందు భూమి లక్షణాన్ని,తర్వాత భూమికి ఉన్న వాస్తును స్థలం ఉన్న దిక్కులను వీధి పోట్లను, మూలలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి.