Site icon HashtagU Telugu

Vastu Tips: పొరపాటున కూడా చీపురును ఈ రోజున అస్సలు కొనుగోలు చేయకండి… చేశారో కష్టాల ఊబిలో కూరుకుపోవడం ఖాయం!

Vastu Tips

Vastu Tips

హిందువులు చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. చీపురుల లక్ష్మీదేవి నివసిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే చీపురిని కాలితో తన్నడం లాంటివి అస్సలు చేయరు. చీపురు విషయంలో పాటించే వాస్తు నియమాలు ఇంటి వాతావరణాన్ని ఆనందం, శాంతి, శ్రేయస్సుతో నింపడానికి సహాయపడతాయి. చీపురులో లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు. అందువల్ల చీపుని సరైన చోట పెట్టకపోయినా సరైన రోజున కొనుగోలు చేయకపోయినా లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట. మరి చీపురు విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చీపురు ఇళ్ళు ఊడ్చిన తర్వాత దానిని పెట్టే ప్లేస్ విషయంలో కూడా శ్రద్ధ వహించాలట. ఎవరూ చూడని విధంగా గదిలో ఒక మూలలో ఉంచాలట. మీరు మీ డబ్బును ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో అలాగే మీ చీపురును కూడా జాగ్రత్తగా చూసుకోవాలట. అలాగే చీపురు లేదా డస్ట్‌పాన్‌ ను ఎప్పుడూ నిటారుగా ఉంచకూడదట. అలాగే తలక్రిందులుగా పెట్టకూడదట. చీపురును ఎల్లప్పుడూ కింద పడుకోబెట్టాలట. ఒకవేళ ఇంట్లో ఉన్న చీపురు పాతది అయ్యి కొత్తది కొనాలని ఆలోచిస్తుంటే కొనడానికి ముందు సరైన రోజు ఏమిటో తెలుసుకోవాలట. అలాగే సోమవారం చీపురు కొనడం అశుభంగా పరిగణించబడుతుందట. అదే సమయంలో శనివారం శనిదేవుడి రోజు కాబట్టి శనివారం కూడా చీపురు కొనకూడదట. ఈ రోజున చీపురు కొనడం లేదా పారవేయడం వల్ల శని దోషం కలుగుతుందట.

అంతే కాదు శుక్లపక్షంలో చీపురు కొనడం మంచిది కాదట. డైనింగ్ రూమ్‌లో చీపుర్లు ఉంచకూడదట. డైనింగ్ రూమ్‌ లో చీపురు పెట్టుకోవడం వల్ల ఇంటికి పేదరికం వస్తుంది. ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుందట. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు, మురికి, దుమ్మును తొలగించడానికి చీపురు చాలా అవసరం. అయితే ఇంటిని పాత చీపురుతో కాకుండా కొత్త చీపురుతో శుభ్రం చేయాలట. ఇలా చేయడం ఇంట్లో సానుకూల శక్తితో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుందట. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. కొత్త ఇంట్లో పాతది లేదా విరిగిన చీపురును ఎప్పుడూ ఉపయోగించకూడదట. గురువారం రోజున కొత్త చీపురు కొనడం శుభప్రదం అని చెబుతున్నారు. అది కూడా కృష్ణ పక్షంలోని గురవారం చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.