Vasthu Tips: వారంలో ఆ రోజు చీపిరి కొంటే చాలు.. అదృష్టం పట్టి పీడీంచడం ఖాయం?

మనం ఆర్థిక సమస్య నుంచి బయటపడాలి అన్న ఆర్థికంగా నిలదొక్కువాలి అన్నా కూడా వాస్తు విషయాలను పాటించడం తప్పనిసరి. అయితే ఆర్థికంగా అభివృద్ధి చ

  • Written By:
  • Publish Date - July 13, 2023 / 07:00 PM IST

మనం ఆర్థిక సమస్య నుంచి బయటపడాలి అన్న ఆర్థికంగా నిలదొక్కువాలి అన్నా కూడా వాస్తు విషయాలను పాటించడం తప్పనిసరి. అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో చీపురు కూడా ఒక భాగం అన్న విషయం మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. చీపుర్లు మీ ఇంటికి డబ్బును కూడా ఆకర్షించగలవని మీకు తెలుసా? అవును, మీరు చదివింది నిజమే. వారంలో ఒక నిర్దిష్టమైన‌ రోజున మీ ఇంటికి చీపురు కొనడం వల్ల మీ నివాసానికి సంప‌ద‌ సమృద్ధిగా త‌ర‌లివ‌స్తుందట. మరి ఈ విషయం గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారంటే..

వాస్తు నిపుణులు వారంలో శనివారం రోజున చీపురుని కొనుగోలు చేయాల‌ని సూచిస్తున్నారు. మీ ఇంట్లో సంప‌ద‌ను ఆకర్షించడానికి ఎప్పుడూ శనివారం చీపురు కొనడంతో పాటు, దానిని దక్షిణ లేదా నైరుతి దిశలో ఉంచాలి. అలాగే చీపురును ఎప్పుడూ బయటి వారికి త్వ‌ర‌గా కనిపించని చోట ఉంచడ‌మే మంచిది. ఒక‌వేళ అది బ‌య‌ట‌కు క‌న‌బ‌డితే కుటుంబానికి దురదృష్టాన్ని తీసుకురావచ్చు. శుభకార్యాల కోసం బయటకు వెళ్లేటప్పుడు చీపురు చూడటం అశుభం. ఇంట్లోని ల‌క్ష్మీ దేవిని బ‌య‌ట‌కు రాకుండా చీపురు కాపాడుతుంది. అది అదృష్టానికి చిహ్నంగా భావించాలి. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం కూడా చీపురు శుభానికి చిహ్నం.

హిందూ గ్రంథాల ప్రకారం, చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. పాడైన‌ చీపురు పారేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అవి పాటించక‌పోతే ఆర్థికంగా ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. పురాణాల‌ ప్రకారం, చీపురును తొక్కినా, చీపురుపై అడుగుప‌డినా లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది. ఇది ఆ వ్య‌క్తి జీవితంలో అత్యంత పేదరికానికి దారి తీస్తుంది. కాబట్టి పాత చీపురును ఎవ‌రూ న‌డ‌వ‌ని చోట పాడేయాలి. అలాగే ఇంట్లోని పాత చీపురును గురువారం, శుక్రవారం బ‌య‌ట పారేయ‌కూడ‌దు. ఏకాదశి నాడు చీపురు పారేయడం అశుభం. చీపురు శుభానికి చిహ్నం, చీపురును పారే కాలువలో లేదా చెట్టు కింద పడేయకూడ‌దు. అలా చేస్తే ల‌క్ష్మీదేవికి కోపం రావచ్చు. పాత చీపురుతో ఇంటిని ఎప్పుడూ ఊడ్చకూడదు. విరిగిన లేదా పాత చీపురును కాల్చకూడ‌దు. శనివారం చీపుర్లు పారేయడానికి అనుకూలమైన రోజు. అమావాస్య రాత్రి కూడా చీపురు పారేయవచ్చు.