Holi: హోలీ పండుగ రోజు ఇలా చేస్తే చాలు.. ఆర్థిక సమస్యలు దూరం అవ్వడం ఖాయం?

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 10:30 AM IST

దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజలు జరుపుకునే పండుగలను హోలీ పండుగ కూడా ఒకటి. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. హోలీ పండుగ వస్తుందంటే చాలు చాలామంది రంగుల పండుగ హోలీని జరుపుకోవడానికి ఇప్పటినుంచి ఏర్పాట్లు మొదలు పెడతారు. ఈ సంవత్సరం మార్చి 25వ తేదీన హోలీ పండుగ జరుపుకోనున్నారు. అయితే ఈ హోలీ పండుగ రోజు ఇంటికి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, ఆ ఇంట్లో సంవత్సరమంతా సంపద ఉంటుందని చెబుతున్నారు పండితులు. అలాగే కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టవచ్చట.

హోలీ నాడు ఈ వస్తువులతో ఆర్ధిక ఇబ్బందులకు చెక్ హోలీ పౌర్ణమి రోజున ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులకు చెక్ పడుతుందని, సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. హోలీ పండుగ నాడు వెండి నాణాన్ని, వెండి పట్టీలను, వెండి ఉంగరాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. హోలీ పండుగ నాడు కొనుగోలు చేసిన వెండి నాణాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల, వెండి పట్టీలను కాళ్లకు ధరించడం వల్ల, వెలికి వెండి ఉంగరం పెట్టుకోవటం వల్ల లక్ష్మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుందని, లక్ష్మీదేవి కటాక్షం దొరుకుతుందట. పైన చెప్పిన వెండి వస్తువులు హోలీ పండుగ రోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల వాస్తు దోషాలు పోతాయి ఇక అంతే కాదు హోలీ పండుగ నాడు ఇంటి ప్రధాన ద్వారానికి తోరణాలను కట్టడం కూడా లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్లు అవుతుంది.

హోలీ పండుగ నాడు ఇంటికి కొత్త అక్వేరియం తెచ్చుకుని దానిని సరైన దిశలో పెట్టి 9 చేప పిల్లలను వేసి పెంచితే కలిసి వస్తుంది. ఇంటికి తీసుకువచ్చిన అక్వేరియాన్ని ఇంటికి ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉంచి చేపలను పెంచడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో సానుకూల శక్తి కోసం వీటిని తెచ్చుకోండి ఇక హోలీ పండుగ నాడు ఇంట్లో వెదురు మొక్కను తెచ్చి పెట్టడం శుభప్రదంగా చెబుతారు. ఇంట్లో వెదురు మొక్కను పెట్టడం వల్ల ప్రతికూల శక్తి నాశనం అవుతుందని, హోలీ ముందు ఈ మొక్కను ఇంటికి తెచ్చుకొని, ఈ మొక్క ప్రభావంతోటి ఇంటికి సానుకూల శక్తిని ఆహ్వానించాలని చెబుతున్నారు. ఇక హోలీ పండుగ నాడు ఇంట్లో క్రిస్టల్ తాబేలు తెచ్చి పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని అంటున్నారు.

ఇంట్లో తాబేలుని పెట్టడం వల్ల సానుకూల శక్తి వస్తుందని, ఆర్థిక పురోగతి బాగా ఉంటుందని సూచిస్తున్నారు. హోలీ నాడు చైనీస్ వాస్తు ప్రకారం ఇది తెచ్చుకుంటే లక్ అంతేకాదు హోలీ పండుగ నాడు చైనీస్ వాస్తు ప్రకారం ఇంట్లోకి డ్రాగన్ విగ్రహాన్ని లేదా చిత్రాన్ని తీసుకురావడం శుభప్రదంగా పరిగణిస్తారు. హోలీ పండుగ నాడు ఇలా చేయడం వల్ల ఇంట్లోని సభ్యులపై చెడు ప్రభావం ఉండదని, ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు హోలీ పండుగ నాడు రంగుల హోలీని ఇంటి ప్రాంగణంలోనే జరుపుకుంటే అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు.