Site icon HashtagU Telugu

Vastu Tips: మీ ఇంట్లో అక్కడ వినాయక విగ్రహం పెడితే చాలు.. ఎలాంటి వాస్తు దోషాలైనా పరార్ అవ్వాల్సిందే!

Vastu Tips

Vastu Tips

విఘ్నేశ్వరుడు.. విజ్ఞాలకు అధిపతి. హిందువులు ఎలాంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు. ముందు ఆయనకు పూజ చేసిన తర్వాతనే ఏదైనా శుభకార్యాన్ని మొదలు పెడుతూ ఉంటారు. పెళ్లిళ్ల నుంచి గృహప్రవేశాల వరకు ప్రతి ఒక్క దానికి విఘ్నేశ్వరుడిని పూజించాల్సిందే. విఘ్నేశ్వరుడి భార్యలు సిద్ధి బుద్ధిలు. ఆయన పిల్లలు శుభం, లాభం. గణపతి ఎక్కడ ఉంటాడో అక్కడ మంగళుడు ఉంటాడు. అందుకనే గణపతిని మంగళమూర్తి అని కూడా అంటారు. గణేశుడు ఉన్న చోట ఎలాంటి దోషం ఉండదని నమ్ముతారు. గణపతి అనుగ్రహం ఉన్న చోట ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

ఇంటి ప్రవేశ ద్వారంలో ఏదైనా వాస్తు లోపం లేదా ఏ రకమైన అడ్డంకి ఉంటే ఆ దోషాన్ని తొలగించేందుకు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చున్న గణపతి విగ్రహాన్ని ఉంచాలి లేదా గణపతి విగ్రహాన్ని రెండు వైపులా అంటే ఇంటి తలుపు చట్రం ముందు, వెనుక ఉంచవచ్చు. అలాగే గణపతి విగ్రహం పరిమాణం గణపతి విగ్రహం ఎప్పుడూ 6 అంగుళాల ఎత్తు లేదా 11 అంగుళాల వెడల్పు కంటే పెద్దదిగా ఉండకూడదట. గణపతి విగ్రహ పీఠం గణపతి ప్రతిమ వెనుక భాగంలో పేదరికం కడుపులో శ్రేయస్సు ఉంటుందని నమ్మకం.

కాబట్టి గణపతి విగ్రహాన్ని వెనుక భాగం కనిపించని విధంగా ఉంచాలట. గణపతి విగ్రహాన్ని ఏ దిశలో పెట్టాలి అంటే ఇంటి ఈశాన్య దిశలో, ఉత్తరం లేదా పడమర దిశలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభప్రదం అని చెబుతున్నారు. గణపతిని పూజించే ఈ పద్ధతి మీకు ఎల్లప్పుడూ ఆనందాన్ని, అదృష్టాన్ని తెస్తుందట. గణపతి విగ్రహం ముఖం ఉత్తరం వైపు ఉండాలట. ఇంట్లో ఎక్కువగా వినాయక విగ్రహాలు వద్దు అయితే ఇంట్లో ఎక్కువగా వినాయకుడి విగ్రహాలను పెట్టుకోకూడదట. అంతేకాదు విరిగిన విగ్రహాన్ని లేదా చినిగిన వినాయక చిత్ర పటాన్ని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోకూడదని చెబుతున్నారు. గణేష్ యంత్రాన్ని ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సు అదృష్టం కలగడానికి గణపతి విగ్రహం వలె గణపతి యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చట. గణపతి యంత్రం ఇంట్లోకి దురదృష్టం రాకుండా నిరోధిస్తుందని చెబుతున్నారు.