Vastu Tips: ఇంట్లో వేణువును ఉంచుకోవడం మంచిదేనా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

వేణువు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే దేవుడు శ్రీకృష్ణుడు. చాలామంది ఇంట్లో అలాగే పూజ గదిలో ఈ వేణువును పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ఈ వే

Published By: HashtagU Telugu Desk
Mixcollage 12 Feb 2024 09 52 Pm 4086

Mixcollage 12 Feb 2024 09 52 Pm 4086

వేణువు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే దేవుడు శ్రీకృష్ణుడు. చాలామంది ఇంట్లో అలాగే పూజ గదిలో ఈ వేణువును పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ఈ వేణువు ఇంట్లో ఉండడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయని ఆనందం శ్రేయస్సు శాంతి లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. ఇంట్లో వేణువు ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుందని నమ్ముతారు. వేణువు శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనది. అందుకే వేణువు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నవారిపై శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. మరి వేణువును ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇంట్లో వేణువును ఉంచడం వల్ల పేదరికం తొలగిపోయి ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయి. కుటుంబంలో గొడవలు జరుగుతున్నా.. భార్యాభర్తల వైవాహిక జీవితం ఒత్తిడితో సాగుతున్నా, ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటే ఆ ఇంట్లో వెదురుతో చేసిన వేణువును ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో వేణువును ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, కుటుంబ సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉంటుందని నమ్ముతారు. ఇంట్లో ఏదైనా జబ్బు మిమ్మల్ని చాలా కాలంగా బాధపెడుతుంటే లేదా ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పూర్తిగా కోలుకోలేకపోతే అటువంటి పరిస్థితిలో, ఖచ్చితంగా ఇంట్లో ఒక వేణువును ఉంచండి.

ఇంట్లో వేణువును పెట్టుకోవడం వల్ల అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకుంటాడని నమ్మకం. ఇంట్లో వేణువును ఉంచడం వల్ల చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని పూర్తి అవుతుందని విశ్వాసం. వేణువు గానం కోసం చేతిని కదిలించినప్పుడు ప్రతికూల శక్తి అంతా ఆ ప్రదేశం నుండి వెళ్లిపోతుందని, వేణువు వాయించినప్పుడు పవిత్రమైన అయస్కాంత ప్రవాహం ఇంట్లో ప్రవహిస్తుంది అని విశ్వాసం. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో వేణువును ఉంచడం వల్ల ఉద్యోగం ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభం కలుగుతుందట.

  Last Updated: 12 Feb 2024, 09:53 PM IST