vastu tips: అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఈ పరిహారాలు పాటించాల్సిందే?

ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. అప్పుల సమస్యల నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల పూజలు పరి

  • Written By:
  • Publish Date - February 10, 2024 / 02:30 PM IST

ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. అప్పుల సమస్యల నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు వ్రతాలు, దానధర్మాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు సరైన ఫలితం లభించదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు కూడా అప్పుల బాధలతో సతమతమవుతుంటే కొన్ని రకాల పరిహారాలు పాటించాల్సిందే.. ఇంతకీ ఆ పరిహారాలు ఏంటి అన్న విషయానికొస్తే..

లక్ష్మీదేవికి ప్రతిరోజు నేతితో దీపం పెడితే డబ్బు సమస్యలు తొలగిపోయి, అప్పుల బాధలు తీరుతాయి. పసుపు వత్తులతో ఐదు గురువారాలు ఆవునెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకధారా స్తోత్రాన్ని చదివితే చాలు అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి చేతులను కళ్ళకద్దుకుని, అర చేతులను చూసినట్లయితే విష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధన నష్టం జరగకుండా ఉంటుంది.. ఒక పీచు తీసిన కొబ్బరికాయను కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మొక్కి అప్పుల బాధలు తీరాలని కోరుకుని పారే నీళ్లలో కొబ్బరికాయ జారవిడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక తీరుతుంది.

ప్రతి బుధవారం చిన్నచిన్న రెండు ఖాళీ కుండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేస్తే అప్పుల బాధలు తీరుతాయి అని, ఇలా ఆరు వారాలపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రతి బుధవారం పాలతో చేసిన పరమానాన్నీ లక్ష్మీ దేవికి నైవేద్యంగా పెడితే మంచిది. దీనివల్ల రుణబాధలు తీరుతాయి. ప్రతి రోజూ ఇంట్లో సాయంత్రం పూట సాంబ్రాణితో ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయి. చీమలకు చక్కెర వేయడం వల్ల సంపాదనలో స్థిరత్వం వస్తుంది. అలాగే వ్యాపారాలు లాభసాటిగా మారతాయి.