Site icon HashtagU Telugu

Vasthu Tips: తరచూ డబ్బు సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా అయితే ఇలా చేయాల్సిందే!

Mixcollage 14 Feb 2024 11 51 Am 5424

Mixcollage 14 Feb 2024 11 51 Am 5424

మామూలుగా ప్రతి ఒక్కరూ కష్టపడి డబ్బు సంపాదించాలని, జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగలక అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవు. అయితే అలా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలి అంటే కొన్ని రకాల పనులు చేయాల్సిందే అంటున్నారు పండితులు. మరి ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి, ఈశాన్య దిశలో వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి. ఈశాన్య దిశ లక్ష్మీ దిశ. డబ్బు రాకకు సంబంధించిన దిశ. ఈ దిశలో వాస్తు దోషాలు తీవ్ర ఆర్థిక నష్టాలకు కారణం అవుతాయి. ఈశాన్య దిశ శుభ్రంగా లేకపోయినా,చెత్త చెదారం పెట్టినా, బరువైన వస్తువులను ఈశాన్య దిశలో పెట్టినా తీవ్రమైన ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అంతేకాకుండా చేతికి రావాల్సిన డబ్బులు కూడా రాకపోగా, సంపాదించిన డబ్బంతా అనవసరపు ఖర్చులకు వృధాగా పోతుంది. అదనంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అలాగే ఈశాన్య దిశలో దుమ్ము, ధూళి, చెత్తా, చెదారం ఉంటే అది వ్యాపార వృద్ధిని, లాభాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈశాన్య దిశలో అన్ని సమయాలలో వెలుతురు ఉండాల్సిన అవసరం ఉంది.

ఈశాన్య దిశలో చీకటిగా ఉంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతాయి. అందుకే ఈశాన్య దిశలో ఎల్లప్పుడూ వెలుతురు ఉండాలి. కాగా చాలా మంది దక్షిణం వైపు తలుపు వుండేలా బీరువాలను పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది. దక్షిణ దిశ యమ దిశ కాబట్టి ఆ వైపు బీరువాను పెట్టడం అస్సలు మంచిది కాదు. ఉత్తరం వైపు తలుపు వుండేలా బీరువాలను, లాకర్లను పెట్టడం వల్ల ఆర్థికంగా లాభిస్తుంది. అంతేకాదు డబ్బులు భద్రపరిచే చోట కూడా ఎప్పుడూ చిత్తడిగా లేకుండా చూసుకోవాలి. శుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీ దేవి నివసిస్తుంది. వాస్తు నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో డబ్బులు నిలవాలంటే ఈశాన్యం దిశ, దక్షిణం దిశ విషయంలో, డబ్బులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పైన చెప్పిన విషయాలు పాటిస్తే చాలు లక్ష్మి అనుగ్రహం కలగడం ఖాయం.