Alum: పటిక వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలు చూపిస్తుంది. కాగా వాస్తు ప్రకారం పటిక ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిస్తుందట. వాస్తు దోషాలతో పాటు ఆర్థిక సమస్యలకు ఇది మంచి పరిష్కారం అని చెబుతున్నారు. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం నల్లటి వస్త్రంలో పటికను కట్టి దిండు కింద ఉంచుకోవడం వల్ల భయంకరమైన కలలు రావట.
చెడు దృష్టి సోకి ఇబ్బంది పడుతున్న వారు పటికను తలపై 7 సార్లు తిప్పి మంటలో వేస్తే వారిని పట్టి పీడిస్తున్న చెడు శక్తి నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులతో లేదా ఏదైనా అప్పులతో బాధపడుతున్న వారు బుధవారం రోజు తమలపాకులపై సింధూరం బొట్టు పెట్టి, ఆకును దారంతో చుట్టి, రావి చెట్టు కింద ఉంచాలట. ఈ పరిహారం చేయడం వల్ల కూడా అప్పులు తీరిపోతాయట.
అలాగే వ్యాపార సంస్థల్లో పటికను నల్లటి వస్త్రంలో కట్టి వేలాడదీయడం వల్ల వ్యాపారం వృద్ధి చెందుతుందని, ఆర్థికంగా అడుగు ముందుకు పడుతుందని చెబుతున్నారు. కాబట్టి పైన చెప్పిన సమస్యలతో బాధపడుతున్న వారు పటికతో చెప్పిన విధంగా చేస్తే ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
Alum: పటికతో ఈ ఐదు రకాల పరిష్కారాలు పాటిస్తే చాలు.. మీ అదృష్టం మారిపోవడం ఖాయం!

Alum