వాస్తు శాస్త్ర ప్రకారం మనం చేసే కొన్ని రకాల పనులు జీవితాన్ని సంతోషంగా ఉంచడంతో పాటు ఇంటికి ఆనందాన్ని కలిగిస్తాయట. ఇకపోతే జీవితంలో ప్రతిదీ వాస్తుతో ముడిపడి ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎవరైతే తూచా తప్పకుండా వాస్తు చిట్కాలను పాటిస్తూ ఉంటారో వారికి ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు. అయితే పాటించాల్సిన వాస్తు నియమాలలో తాబేలు ఇంట్లో పెట్టుకోవడం కూడా ఒకటి. చాలామంది తాబేలు ఇంట్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటారు.
మరి ఇలా తాబేలు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో, తాబేలుని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా హిందూమతంలో తాబేలును విష్ణువు రూపంగా భావిస్తారు. అందుకే తాబేలును పూజ గదిలో పెట్టి మరి పూజలు చేస్తూ ఉంటారు. తాబేలు సానుకూల శక్తి, భద్రత, శ్రేయస్సు, దీర్ఘాయువుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. దీన్ని సరైన దిశలో ఉంచడం వల్ల ఇంట్లో పురోగతి పెరుగుతుందట. రాగితో తప్ప ఏదైనా లోహంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచుకోవచ్చట.
వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఇంట్లో లోహపు తాబేలును లేదా సజీవ తాబేలును ఉంచినట్లయితే దానికి అత్యంత అనుకూలమైన దిక్కు ఉత్తరం అని చెప్పవచ్చు. ఉత్తర దిశను కుబేరుడి దిక్కుగా చెబుతుంటారు. ఈ దిశలో లోహపు తాబేలును ఉంచడం వల్ల సంపద, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయట. కుటుంబానికి సంపదలు చేకూరడంతో పాటు ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుందని చెబుతున్నారు. మీ ఇంట్లో స్ఫటిక తాబేలు ఉంటే మీరు దానిని నైరుతి దిశలో ఉంచవచ్చట. ఈ దిశ ప్రేమ, సంబంధం, స్థిరత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుందట. ఈ దిశలో క్రిస్టల్ తాబేలు ఉంచడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ మెయింటైన్ చేస్తుందట. అలాగే ఆ ఇంట్లోని వ్యక్తుల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెబుతున్నారు. ఒకవేళ మీ ఇంట్లో చెక్క తాబేలు ఉన్నట్లయితే అందుకు సరైన దిశ దక్షిణ దిశ. దక్షిణ దిశలో చెక్క తాబేలును ఉంచడం వల్ల కుటుంబంలో ఎలాంటి గొడవలు చికాకులు ఉండవట.