Vastu Shastra: ఈ వస్తువులను ఇంట్లో ఉంచుతున్నారా.. అయితే దరిద్రాన్ని వెంటపెట్టుకున్నట్లే?

ప్రస్తుత రోజుల్లో రోజు రోజుకి వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇల్లు నిర్మించడం నుంచి

  • Written By:
  • Publish Date - February 22, 2023 / 06:00 AM IST

ప్రస్తుత రోజుల్లో రోజు రోజుకి వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇల్లు నిర్మించడం నుంచి ఇల్లు పూర్తయి వస్తువుల అమరికల విషయం వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా చాలామంది వాస్తు చిట్కాలను పాటిస్తూనే ఉన్నారు. ఇంట్లో ఎటువంటి మొక్కలు పెంచుకోవాలి, ఎటువంటి వస్తువులు పెట్టుకోవాలి, దేవుడి గదిలో ఎటువంటి ఫోటోలు విగ్రహాలు ఉండాలి ఇలా అన్ని విషయాలలో కూడా వాస్తు విషయాలను పాటిస్తున్నారు. చాలామంది వాస్తు శాస్త్ర ప్రకారం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసం ఆనందం శ్రేయస్సు కోసం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు.

కానీ వాస్తు ప్రకారం గా కొన్ని రకాల పనులు చేయకూడదు. కొన్ని రకాల వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది. అటువంటి వస్తువులు ఉన్నప్పుడు వెంటనే వాటిని తీసి బయట పారేయటం మంచిది. ముందుగా మీకు నచ్చిన ప్లాస్టిక్ లేదా గాజు సామాను ఏదైనా విరిగినా లేదా పగిలినా వెంటనే దానిని బయటపడేయటం మంచిది. దానిని అతికించి వాడుకుంటే సరిపోదా? అని చాలా మంది అనుకుంటుంటారు. అయితే, ఎప్పుడైతే ఒక పరిపూర్ణంగా ఉండే వస్తువు కిందపడి పగిలిపోతుందో దాని నుంచి నెగెటివ్ ఎనర్జీ అధికంగా విడుదల అవుతుందటని శాస్త్రం చెబుతోంది. దానిని అతికించినా అందులో పాజిటివ్ ఎనర్జీ స్టోర్ అయ్యి ఉండటం చాలా కష్టం.

అందుకే ఇంట్లో పగిలిన అద్దాలు, విరిగిన చెక్క కుర్చీలు, విరిగిపోయిన వస్తువులను వెంటనే ఇంట్లో నుంచి దూరంగా తీసుకువెళ్లాలి. ఇంటికి వెనుక లేదా స్టోరీ రూంలో పెట్టిన పరువాలేదు. కానీ నట్టింట్లో మాత్రం ఉంచరాదు. వాటిని వినియోగించరాదు. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో సుఖసంతోషాలు పోయి కష్టాల మొదలవుతాయి. నెగెటివ్ ఎనర్జీ అధికంగా ప్రసరిస్తే ఆ ఇంట్లోని వారికి అనారోగ్యం, ఆర్థికంగా నష్టపోవడం, అప్పుల పాలు అవుతారు. అలాగే ఇంట్లో కలగాలంటే ఇంట్లో 8మూలలు చూపించే అద్దాన్ని వాడితే అదృష్టం కలిసి వస్తుంది.