మామూలుగా వాస్తు శాస్త్ర ప్రకారం ప్రతి ఒక దిశకు ప్రత్యేకమైన దేవుడికి అధిపతి కలిగి ఉంటాడట. అలాగే ప్రత్యేక శక్తిని కూడా కలిగి ఉంటుందట. అలా సూర్య దేవుని కుమారుడు అయిన శనీశ్వరుడు కూడా ఒక దిశకు అధిపతి అని చెబుతున్నారు. ఆ దిశ మరేదో కాదు పశ్చిమ దిశ. వాస్తు శాస్త్రం ప్రకారం శనిశ్వరుడి దిశ పశ్చిమ దిశగా పరిగణించబడుతుందట. కాబట్టి కొన్ని రకాల వస్తువులను ఈ దిశలో అనగా పశ్చిమ దిశలో ఉంచడం నిషేధించబడిందట. చెత్త డబ్బాను ఇంటికి పశ్చిమ దిశలో పెట్టకూడదట. ఈ వస్తువులను పశ్చిమ దిశలో ఉంచడం వల్ల శనిశ్వరుడికి ఆగ్రహం కలుగుతుందట.
ఇంటి పశ్చిమ దిశలో బూట్లు, చెప్పులు, షూ స్టాండ్‌లు, మురికి బట్టలు మొదలైనవి ఉంచకూడదట. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశలో బూట్లు, చెప్పులు ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుందట. ఆర్థిక సమస్యలు కూడా కలుగుతాయని చెబుతున్నారు. అదేవిధంగా వాస్తు ప్రకారం ఇంటికి పశ్చిమ దిశలో బరువైన ఇనుప వస్తువులు, పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా విరిగిన గడియారాలను పొరపాటున కూడా పెట్టకూడదట. ఈ వస్తువులను పశ్చిమ దిశలో ఉంచడం వల్ల శనిపై అశుభ ప్రభావం చూపుతుందట. ఇంటికి పశ్చిమ భాగంలో ముదురు ఎరుపు, నలుపు లేదా చాలా ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించకూడదట.
వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల శని గ్రహ ప్రభావంలో అసమతుల్యత ఏర్పడుతుందని, ఇది జీవితంలో కష్టాలను పెంచుతుందని పండితులు చెబుతున్నారు. కాగా చీపురును ఇంటికి పశ్చిమ దిశలో ఉంచకూడదట. చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. కనుక చీపురును పశ్చిమ దిశలో ఉంచడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంది. అయితే బృహస్పతికి, శనిశ్వరుడికి మధ్య స్నేహం సంబంధాలు లేవు. కనుక తులసి మొక్కను ఇంటికి పశ్చిమ దిశలో పెంచకూడదట. అంతేకాదు ఇంటికి పశ్చిమ దిశ వైపు ఖాళీగా గాలి, వెలుతురు వచ్చేలా ఉండాలి. అలాగే శనిశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పశ్చిమ దిశలో నువ్వుల నూనెతో లేదా ఆవ నూనె దీపం వెలిగించాలట.