Site icon HashtagU Telugu

Camphor: దరిద్రం వదిలిపోవాలి అంటే కర్పూరాన్ని ఈ మూడు ప్రదేశాలలో పెట్టాల్సిందే!

Camphor For Skin

Camphor For Skin

సువాసనలు వెదజల్లే పదార్థాలలో కర్పూరం కూడా ఒకటి. కర్పూరం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కర్పూరం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా కర్పూరాన్ని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇకపోతే కర్పూరాన్ని ఇంట్లో ఒక మూడు ప్రదేశాలలో పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి కర్పూరాన్ని ఎక్కడెక్కడ పెడితే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పూజగదిలో దేవుళ్ల ఫోటోలు పెట్టుకుంటాం. అక్కడే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తాము. అయితే వాస్తు ప్రకారం పూజగదిలో కర్పూరం పెడితే ఇంట్లో సానుకూలత పెరుగుతుందట. త్వరగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు. అదే విధంగా వాస్తు ప్రకారం కర్పూరంని ఇంటి ప్రధాన ద్వారానికి కూడా కట్టాలట. లేకపోతే ప్రధాన ద్వారం వద్ద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి సానుకూలత ప్రసరిస్తుందట. ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుందని, ఆ ఇంట్లో సుఖఃసంతోషాలు వెల్లి విరుస్తాయని చెబుతున్నారు.

అలాగే కర్పూరాన్ని ఇంట్లో డబ్బులు దాచిపెట్టే ప్రదేశంలో పెట్టుకోవాలట. కర్పూరం ఇంటి అల్మారాలో డబ్బులు దాచిపెట్టే ప్రదేశంలో పెట్టడం వల్ల ధనప్రవాహం పెరుగుతుందని, అప్పుల ఊబి నుంచి కూడా త్వరగా బయట పడతారని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో కర్పూరంతో దూపం వేయడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ వాతావరణం ఉంటుందట.