Site icon HashtagU Telugu

Lakshmi: అదృష్ట లక్ష్మి అనుగ్రహంతో ధనవంతులు కావాలంటే ఇలా చేయాల్సిందే?

Mixcollage 25 Jul 2024 10 59 Am 1329

Mixcollage 25 Jul 2024 10 59 Am 1329

మాములుగా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అన్నది కామన్. ముఖ్యంగా చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. ప్రస్తుత రోజుల్లో డబ్బు అన్నది చాలా ముఖ్యం.ఆ డబ్బు ఉంటే సులువుగా చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఎక్కువ డబ్బు లేకపోవడం వలన సమస్యలు మరింత తీవ్రమవుతాయి. మీరు కూడా ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు కావాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలంటే వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి. మరి ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దిశగా మీరు తగిన చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చేతిలో ఐదు లవంగాలు తీసుకెళ్లాలి. పని మీద మీరు బయటకు వెళ్లేటప్పుడు ఐదు లవంగాలను ఎర్రటి గుడ్డలో వేసుకుని జేబులో పెట్టుకోవాలి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ లవంగాలను మీ ఇంటిలోని పూజా మందిరంలో ఉంచాలి. అదేవిధంగా శ్రీమద్భగవద్గీత చదవడం వల్ల జీవితం లోని సమస్యలన్నీ తీరుతాయని చెబుతున్నారు. గీతలోని 11వ అధ్యాయాన్ని చదవడం ద్వారా డబ్బు సమస్య పరిష్కరించబడుతుందని, అంతేకాకుండా, ఎల్లప్పుడూ మీ దేశాన్ని, మహిళలను గౌరవించాలని, స్త్రీ లను చిన్నచూపు చూసి ఎప్పుడూ అగౌరవపరచవద్దని చెబుతున్నారు.

మహిళలను కించపరిచి వారిని చులకనగా చూస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించదట. లక్ష్మీ దేవి ముందు నెయ్యితో దీపం వెలిగించి, కనకధార స్తోత్రాన్ని రోజూ పఠించే వారి ఇళ్లలో డబ్బుకు లోటు ఉండదట. కనకధారా స్తోత్ర పారాయణం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు ఐశ్వర్యం వర్షిస్తాయట. లక్ష్మిదేవి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయట. వీలైనన్ని సార్లు ఇంట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం చాలా మంచిది అని చెబుతున్నారు. శనివారం రోజు ఇనుప వస్తువులు కొనుగోలు చేయకండి. అంతే కాకుండా శనివారం రోజున నల్లని కొత్త బట్టలు కొనుగోలు చేయకూడదట. శనివారం సాయంత్రం మీ ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించాలని పండితులు చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల లక్ష్మిదేవి పరుగున మీ ఇంటికి వస్తుందట. శుక్రవారంతో పాటు శనివారం కూడా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చెయ్యడం చాలా మంచిది. మనమందరం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూర్చోవడానికి ఆసనాలు వేస్తాము. వాస్తు ప్రకారం, ఒక వ్యక్తి లక్ష్మీ మంత్రాన్ని జపించేటప్పుడు గులాబీ ఆసనాన్ని ఉపయోగించాలట. అదేవిధంగా, ఎవరైనా హనుమాన్ మంత్రాన్ని పఠిస్తే ఎరుపు రంగు ఆసనాన్ని ఉపయోగించాలట. పూజ చేసినప్పుడల్లా, పూజ చేసిన తర్వాత ఆసనానికి నమస్కరించాలట. అలాగే మీరు కుర్చునే ఆసనం మీద ఎప్పుడూ అడుగు పెట్టకూడదట. పూజ కోసం ఉపయోగించే ఆసనానికి మీ కాలు ఏమాత్రం తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలట. .