Site icon HashtagU Telugu

Lakshmi Devi: అదృష్ట లక్ష్మి అనుగ్రహంతో ధనవంతులు అవ్వాలంటే ఈ విధంగా చేయాల్సిందే!

Lakshmi Devi

Lakshmi Devi

ప్రతి ఒక్కరికి జీవితంలో కష్టాలు రావడం అన్నది సహజం. కష్టాలు లేని మనిషి ఉండడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఆర్థిక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే మీ జీవితం సంతోషంగా ఉండి ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా బాగా ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు కూడా ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు కావాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలంటే వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు. ఆ దిశగా మీరు తగిన చర్యలు తీసుకోవాలట.

అయితే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చేతిలో ఐదు లవంగాలను తీసుకెళ్లాలట. ముఖ్యంగా మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఐదు లవంగాలను ఎర్రటి గుడ్డలో వేసుకొని జేబులో పెట్టుకొని వెళ్లాలట. తర్వాత తిరిగి ఇంటికి వచ్చాక ఆ లవంగాలను మీ ఇంట్లోని పూజ మందిరంలో ఉంచి భగవద్గీత 11వ అధ్యాయం చదవండి శ్రీమద్భగవద్గీత చదవడం ద్వారా జీవితంలోని సమస్యలన్నీ తీరుతాయని పెద్దలు చెబుతున్నారు. గీతలోని 11వ అధ్యాయాన్ని చదవడం ద్వారా డబ్బు సమస్య పరిష్కరించబడుతుందట. కేవలం ఇంట్లోని స్త్రీలను మాత్రమే కాకుండా బయట స్త్రీలను కూడా గౌరవించడం నేర్చుకోవాలి. ఎవరైతే స్త్రీని గౌరవిస్తారు కించపరచకుండా మాట్లాడుతారు అటువంటి వ్యక్తికి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట. లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి కనకధారా స్తోత్రం వల్ల ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదట.

కనకధారా స్తోత్ర పారాయణం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు ఐశ్వర్యం వర్షిస్తాయట. లక్ష్మిదేవి ఆశీస్సులు కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటాయట. వీలైనన్ని సార్లు ఇంట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం చాలా శుభపరిణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అలాగే సూర్యుని ముందు గాయత్రీ మంత్రాన్ని జపించిన వ్యక్తికి అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయట. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల ఆ వ్యక్తి విశ్వాసం పెరుగుతుందట. అతని ప్రవర్తనను మృదువుగా చేస్తుందట. అలాగే ధర్మం, అర్థ, కామ మరియు మోక్షాలను అందిస్తుందని చెబుతున్నారు. ప్రతిరోజు సూర్యనమస్కారం చేసే అలవాటు ఉన్న వాళ్లు జీవితంలో పైకి వస్తారట. శనివారం రోజు ఇలాంటి పరిస్థితులలోను ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదు.

నల్లని బట్టలు కొనుగోలు చేయకూడదు. శనివారం రోజు సాయంత్రం మీ ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించాలి. చాలామంది ఈ కేవలం శుక్రవారం మాత్రమే లక్ష్మీదేవిని పూజిస్తారు. శనివారం పూజించడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయని అమ్మవారు పరుగున మీ ఇంటికి వస్తుందని చెబుతున్నారు. మనమందరం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూర్చోవడానికి ఆసనాలు వేస్తాము. వాస్తు ప్రకారం, ఒక వ్యక్తి లక్ష్మీ మంత్రాన్ని జపించేటప్పుడు అతను గులాబీ ఆసనాన్ని ఉపయోగించాలి. అదేవిధంగా ఎవరైనా హనుమాన్ మంత్రాన్ని పఠిస్తే అతను ఎరుపు రంగు ఆసనాన్ని ఉపయోగించాలి. పూజ చేసినప్పుడల్లా, పూజ చేసిన తర్వాత ఆసనానికి నమస్కరించాలి. అలాగే మీరు కూర్చునే ఆసనం మీద ఎప్పుడూ అడుగు పెట్టకూడదు. పూజ కోసం ఉపయోగించే ఆసనానికి మీ కాలు ఏ మాత్రం తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పైన తెలిపిన నియమాలను కొంతకాలం పాటించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు.

Exit mobile version