Vastu Tips: ఇలా చేస్తే చాలు.. దెబ్బకి దరిద్రం వదిలిపోయి లక్ష్మిదేవి అదృష్టంలా పట్టిపీడిస్తుంది?

ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడం కోసం ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండడం కోసం వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల

  • Written By:
  • Publish Date - January 17, 2023 / 06:00 AM IST

ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడం కోసం ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండడం కోసం వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు పరిష్కారాలు చెప్పబడిన విషయం తెలిసిదే. వాస్తు శాస్త్రంలో చెప్పబడిన ఆ పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం తోపాటు మనకున్న గ్రహ పీడలు కూడా తొలగించుకోవచ్చు. ఒకవేళ మీకు దరిద్రం పట్టినట్లయితే కొన్ని రకాల పనులు చేయడం వల్ల దరిద్రం పోయి లక్ష్మీదేవి అదృష్టంలో పడుతుంది. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఎప్పుడు ప్లాస్టిక్ పూలను మొక్కలను ఉపయోగించకూడదు. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో పేదరికం అలాగే ప్రతికూల శక్తి పెరుగుతుంది.

అలాగే ఇంటి సభ్యుల్లో కృత్రిమత్వం రావడంతో పాటుగా సహజంగా కూడా ఉండరు. అదేవిధంగా ఇంటి ప్రధానముఖ ద్వారం అనగా మెయిన్ డోర్ ను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ప్రధాన ముఖద్వారం శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవికి కోపం వచ్చి అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇంటి ప్రధాన ముఖద్వారం శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో కలహాలు అన్ని సమస్యలు పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే వాస్తు ప్రకారం ఇంటి చుట్టూ ఎప్పుడూ పచ్చదనం ఉండేలా చూసుకోవాలి. అలా అని ఇంటికి దగ్గర ముళ్ళ మొక్కలు పెరగనివ్వకూడదు. ఇంటి దగ్గరలో ముళ్ళ మొక్కలు ఉంటే కుటుంబంలో తగాదాలు పెరుగుతాయి.

అదేవిధంగా ఇంట్లో ఉండే ఖజానా డబ్బులను ఎప్పుడు దక్షిణం గోడకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. దాని ముఖము ఉత్తరం వైపు తెరవాలని గుర్తించుకోవాలి. ఉత్తరం గోడ వైపు అద్దం ఉంచడం వల్ల సంపద ప్రతిబింబంలో కనిపిస్తుంది. ద్వారా సంపద మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంట్లో గోడలపై సాలెపురుగులు నీటి తేమ ఉండకుండా చూసుకోవాలి. వాటితో పాటుగా ఇంట్లో ఎప్పటికప్పుడు బూజును శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో బూజు దుమ్ము ధూళి ఎక్కువగా ఉండటం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శుభ్రంగాఉండే ఇంట్లో మాత్రమే నివాసం ఉంటుంది.