Vastu Tips: ఈ మొక్కను ఇంట్లో నాటితే డబ్బే డబ్బు.. పూర్తి వివరాలు ఇవే!

చాలామంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిలబడడం లేదని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని బాధపడుతూ ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
Aparjitha Plant

Aparjitha Plant

చాలామంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిలబడడం లేదని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని బాధపడుతూ ఉంటారు. ఇందుకోసం అనేక విధాల పూజలు, గుళ్ళు గోపురాలు కూడా తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా అనేక రకాల పరిష్కారాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే ఇలా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ ఒక్క మొక్కను ఇంట్లో పెంచితే చాలు. అటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. మరి ఆ మొక్క ఏమిటో?ఆ మొక్కను పెంచడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆ మొక్క పేరు అపరాజిత మొక్క. ఈ మొక్కకు పూసే పువ్వులు శంకువు ఆకారంలో ఉంటాయి. దీన్నే కృష్ణ కాంత లేదా విష్ణుకాంత అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కకు పూసే పువ్వులు రెండు రకాలుగా ఉంటాయి అందులో ఒకటి నీలిరంగు మరొకటి తెలుపు రంగు. అయితే ఈ మొక్కను మన ఇంట్లో నాటడం వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యలను ఉపసమనం కలుగుతుంది. ఇందులో తెలుపు రంగు పువ్వు పూసే మొక్క ధనలక్ష్మి ఆకర్షిస్తుంది. ఈ మొక్క మన ఇంట్లో ఉన్నంత సేపు సంతోషం ప్రశాంతత నెలకొనడంతో పాటు ఆహార ధాన్యాల వంటి వాటికి కొదువ అనేదే ఉండదు.

కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా మన తోటలో కూడా ఈ నీలిరంగు అపరాధిత మొక్కలు నాటడం వల్ల ఈ మొక్క సంపద మరియు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. నీలిరంగు అపరాజిత మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో నీ కుటుంబ సభ్యుల మేధస్సు తెలివితేటలు పెరుగుతాయి. ఈ అపరాజిత మొక్కను ఇంటికి ఉత్తర దిశలో నాటడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు అనేవి కచ్చితంగా వస్తాయి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం మరియు శాంతి అనేది ఉంటుంది. అయితే ఈ తీగను ఎప్పటికీ పశ్చిమ దిశలో లేదా దక్షిణ దిశలో నాటకూడదు.

  Last Updated: 17 Sep 2022, 11:16 PM IST