Site icon HashtagU Telugu

Vasthu Tips: మీ పూజగదిలో లక్ష్మి,వినాయక విగ్రహాలు ఉన్నాయా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి!

Vasthu Tips

Vasthu Tips

మామూలుగా చాలా మంది ఇంట్లోని పూజ గదిలో చాలా దేవుళ్ల విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. వాటిలో లక్ష్మీదేవి వినాయక విగ్రహాలు కూడా ఒకటి. ఎక్కువ మంది ఈ రెండు విగ్రహాలను తప్పనిసరిగా పూజ గదిలో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అయితే ఈ రెండు విగ్రహాలను పూజించడం మంచిదే కానీ ఈ విగ్రహాలను పూజించే సమయంలో పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఎలాంటి పొరపాటు చేయకూడదో, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శాస్త్రాల ప్రకారం పూజ గదిలో లక్ష్మీ దేవి విగ్రహాన్ని సరైన దిశలో ఉంచడం వల్ల విశేష ప్రయోజనాలు, సంపద లభిస్తాయి. గణేశుడు, లక్ష్మి విగ్రహాలను కలిపి ఉంచాలి. హిందూ మత విశ్వాసంలో గణేశుడు జ్ఞానానికి అధినేత. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సుకు అధి దేవతగా పరిగణించబడుతుంది. కాబట్టి పూజ గదిలో ఇద్దరినీ కలిపి ఉంచాలి. దీపావళి, అక్షయ తృతీయ వంటి ప్రత్యేక శుభ సందర్భాలలో ఈ ఇద్దరు దేవుళ్ళను కలిపి పూజించాలి. పూజా గదిలో లేదా పూజ చేసుకునే చోట గణేశుడు, లక్ష్మి దేవి విగ్రహాలు ఒకచోట ఉంచుతారు. పురాణ శాస్త్రాల ప్రకారం ఇంటి పూజా గదిలో గణేశుడు, లక్ష్మిదేవి విగ్రహాలను ఉత్తరం వైపున ఉంచాలి.

అయితే వినాయకుని ఎడమ వైపున లక్ష్మి విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాస్తవానికి పురుషులకు ఎడమ వైపున వారి భార్యలు కూర్చుంటారు. లక్ష్మి వినాయకుని భార్య కానప్పటికీ, ఆమెను వినాయకుడికి ఎడమ వైపున ఉంచడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. అలాగే ఆర్థిక సంక్షోభం ప్రారంభమవుతుంది. కాబట్టి లక్ష్మీ దేవి విగ్రహాన్ని వినాయకుడికి కుడి వైపున ఉంచాలి. ఈ విధంగా లక్ష్మి, గణేష్ ని పూజించేటప్పుడు ఎప్పుడు కూడా విడివిడిగా కాకుండా కలిపి పూజించడం మంచిదని చెబుతున్నారు.