Car – Vastu : వాహనాల పార్కింగ్.. వాస్తు టిప్స్ ఇవిగో

ఇంట్లోని గదుల నుంచి మొదలుకొని చెప్పుల స్టాండ్ వరకు ప్రతిదానికీ వాస్తు నియమాలు ఉంటాయి.

  • Written By:
  • Publish Date - June 26, 2024 / 08:54 AM IST

Car – Vastu : ఇంట్లోని గదుల నుంచి మొదలుకొని చెప్పుల స్టాండ్ వరకు ప్రతిదానికీ వాస్తు నియమాలు ఉంటాయి. వాటితో పాటు వాహనాల పార్కింగ్‌కు కూడా కొన్ని వాస్తు రూల్స్ ఉంటాయి. కానీ వీటిపై చాలామంది శ్రద్ధ వహించరు. ఎలా పడితే అలా వాహనాలను పార్క్ చేస్తుంటారు. సరైన దిశలో, సరైన రకంగా  వాహనాలను(Car – Vastu) పార్క్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పండితులు అంటున్నారు. వాళ్లు చెబుతున్న టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

దక్షిణం, నైరుతి దిశలు బెస్ట్

కార్లు, బైక్స్, స్కూటర్స్ వంటివన్నీ నిర్జీవ వస్తువులు. వీటిని ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచకూడదని వాస్తు నియమాలు చెబుతున్నాయి. మీ వాహనాలకు సానుకూల శక్తి రావాలంటే ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలి.

ఇళ్లు, గ్యారేజీ.. గ్యాప్ మస్ట్

కొంతమంది ఇళ్లు, వాహనాల పార్కింగ్ గ్యారేజీలు పక్కపక్కనే ఉంటాయి. అయితే అలా రెండూ ఆనుకొని ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటికి, గ్యారేజీకి మధ్య ఖాళీ స్థలం ఉండేలా చూడాలని సూచిస్తోంది.

Also Read :Special Status : ఏకతాటిపైకి ఏపీ పార్టీలు.. ‘‘ప్రత్యేక హోదా’’ను సాధించే కరెక్ట్ టైం ఇదేనా ?

గ్యారేజీకి బెస్ట్ కలర్స్

చాలామంది ఇంటి గ్యారేజీకి పెయింటింగ్ వేయించరు. ఇంకొందరు ఇష్టం వచ్చిన రంగులతో గ్యారేజీని నింపేస్తుంటారు. వాస్తు శాస్త్రం మాత్రం.. గ్యారేజీకి నీలం, పసుపు, తెలుపు రంగులు మంచివని చెబుతోంది. ఎరుపు, నలుపు వంటి ముదురు రంగులను గ్యారేజీకి వేయొద్దని వాస్తు శాస్త్రం అంటోంది.

నడిచేందుకు స్థలం

వాహన గ్యారేజీ విశాలంగా ఉండేలా చూసుకోవాలి. వాహనాలను పార్క్ చేశాక కూడా మనం నడిచేందుకు కొంత స్థలం మిగిలేలా చూడాలి. గ్యారేజీలోకి సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి. దీనివల్ల ప్రతికూల శక్తికి అక్కడ తావు ఉండదు.

డోర్స్ తీయడానికి.. ఈ దిక్కులు

వాహన గ్యారేజీ నైరుతి దిశలో ఉంటే బెస్ట్.  అయితే వాహనాలను గ్యారేజీ నుంచి బయటికి తీసేందుకు ఉత్తరం, తూర్పు దిశలే మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ దిశల నుంచి కారు డోర్స్ తీస్తే మంచిది. శుభాలు కలుగుతాయని విశ్వాసం.

గురువారం.. వాహన పూజలు

వాహనాల్లో ఉండే చెడు శక్తిని పారదోలడానికి, రాబోయే ప్రమాదాలను నివారించడానికి వాటికి పూజలు చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.  ప్రత్యేకించి వాహనాలకు పూజలు చేయడానికి గురువారం మంచి రోజు అని అంటున్నారు.

Also Read :Nokia: యూపీఐ, యూట్యూబ్‌తో 3 నోకియా ఫీచర్ ఫోన్లు